ఎన్టీఆర్ మూవీ నుంచి అప్డేట్ వస్తుందంటేనే అభిమానుల్లో సందడి అంతా ఇంతా కాదు. వాళ్ల ఆనందానికి అవధులు ఉండవు. అందునా ప్రస్తుతం ఆయన నటిస్తోంది ప్రశాంత్ నీల్‌తో. ఇక అప్డేట్ను ఫ్యాన్స్ ఏ రేంజ్లో ఊహించుకుంటారు? అంతా గోవిందా. ప్రస్తుతం మాస్ ట్రెండ్ పేరిట స్టార్ హీరోలు అదిరిపోయే అప్డేట్స్, మాస్ పోస్టర్స్‌తో ఫ్యాన్స్‌ను సర్ప్రైజ్ చేస్తున్నారు. తాజాగా రామ్ చరణ్, అల్లు అర్జున్ ఇద్దరూ తమ అభిమానులను ఆటంబాంబ్ లాంటి సర్ప్రైజ్లతో అల్లల్లాడించారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్-నీల్ ప్రాజెక్టు నుంచి అప్డేట్ ఇస్తామనగానే.. అభిమానులు తెగ సంబరపడిపోయారు. చెర్రీ, బన్నీ ఇచ్చిన సర్ప్రైజ్ కంటే ఎక్కువగా ఉంటుందని ఊహించుకున్నారు. కానీ కేవలం నీల్ ప్రాజెక్ట్‌లో ఎన్టీఆర్ జాయిన్ అయ్యే తేదీని ప్రకటించి ఉసూరుమనిపించారు. ఏప్రిల్ 22 నుంచి ఎన్టీఆర్ షూటింగ్లో జాయిన్ అవుతున్నాడని మేకర్స్ ప్రకటించారు. వాస్తవానికి బన్నీ, చెర్రీల అప్డేట్స్ రాకుంటే దీనిని ఎన్టీఆర్ ఫ్యాన్స్ గొప్పగానే తీసుకుని ఉండేవారేమో కానీ కంపారిజన్ రావడంతో తల పట్టుకుంటున్నారు. అప్డేట్ అని కొండంత రాగం తీసి చివరకు ఇచ్చింది ఇదా? అని పెదవి విరుస్తున్నారు.
ప్రజావాణి చీదిరాల