lyricist kulashekar :
తొంభైల చివరలో, ఇరవై ఒకటవ శతాబ్దం తొలిరోజుల్లో ఒక పెన్నులో నుండి వచ్చిన అక్షరాలు తెలుగువారి నోట గట్టిగానే నానింది.
ఆ పెన్ను పట్టుకున్న రచయిత పేరు కులశేఖర్.
దర్శకుడు తేజ తెలుగు చిత్ర సీమలో ఒక వెలుగు వెలగటానికి తనను తాను సిద్ధం చేసుకుంటున్న సమయంలో
ఆయనతో పాటు సంగీత దర్శకుడు ఆర్.పి. పట్నాయక్, పాటల రచయిత కులశేఖర్ పేర్లు మారు మోగిపోయాయి.
ఎంతలా అంటే వారి కాంబినేషన్‌లో సినిమా విడుదలైతే అది పెద్ద హిట్ అనేంతలా వారి ప్రభావం ఉండేది.
అలాంటి అద్భుతమైన రచయిత తర్వాత కాలంలో కనుమరుగు (పెనుమరుగు) అయ్యారు.
మంగళవారం కులశేఖర్ శాస్వతంగా కనుమరుగైపోయారు. గత కొంతకాలంగా ఆరోగ్యం బాగాలేని కారణంగా శాశ్వత నిద్ర లోకి జారిపోయారు కులశేఖర్.
ఇప్పుడు స్టార్ డైరెక్టర్‌గా వెలుగొందుతున్న వశిష్టను హీరోగా అంజలి హీరోయిన్‌గా కులశేఖర్ దర్శకత్వంలో ఓ సినిమా ప్రారంభమైంది.
ఆ సినిమా తరువాత నుండి చిత్ర పరిశ్రమకు దూరమైపోయారు కులశేఖర్.
తర్వాత అనేక అలవాట్లతో ఇబ్బంది పడినట్లు సమాచారం. 53 సంవత్సరాల కులశేఖర్ మరణవార్త విన్న వెంటనే ఒక్క నిమిషం షాక్‌కు గురైంది చిత్రపరిశ్రమ.
శివమల్లాల
Also Read This : సమంత ఎంత గ్రేటో…