మాస్ మహారాజా రవితేజ ఇటీవల యువ దర్శకుడు వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన టైగర్ నాగేశ్వరరావు మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చారు.
నుపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్స్ గా ఒకప్పటి గజదొంగ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా తెరకెక్కిన ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్ విజయం అందుకుంది.
ఇక ప్రస్తుతం మొత్తం రెండు సినిమాలు చేస్తున్నారు రవితేజ. అందులో ఒకటి కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్న యాక్షన్ మూవీ ఈగిల్ కాగా
మరొకటి మాస్ కమర్షియల్ సినిమాల దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న రీమేక్ మూవీ మిస్టర్ బచ్చన్.
ఈ రెండు సినిమాల పై మాస్ రాజా ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి.
అయితే వీటిలో ముందుగా మాస్ యాక్షన్ మూవీ ఈగిల్ ఈ సంక్రాంతికి రిలీజ్ కానుందని ఇటీవల మేకర్స్ ప్రకటించారు.
ఇప్పటికే సాంగ్స్, టీజర్, ట్రైలర్ తో అందరినీ ఆకట్టుకున్న ఈగిల్ మంచి అంచనాలు ఏర్పరిచింది.
ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్స్ గా నటిస్తుండగా యువ సంగీత దర్శకుడు దవ్జంద్ అలరించే సాంగ్స్ అందించారు.
ఇక కీలక పాత్రల్లో వినయ్ రాయ్, మధుబాల, నవదీప్, శ్రీనివాస్ అవసరాల కనిపించనున్నారు.
విషయం ఏమిటంటే, నిజానికి రానున్న సంక్రాంతి రేస్ లో ఉండాల్సిన ఈగిల్ మూవీని ఫైనల్ గా ఆ రేస్నుండి తప్పుకుని ఫిబ్రవరి 9న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి వచ్చేందుకు సిద్ధం అయింది.

లేటెస్ట్ రిలీజ్ డేట్ ని కొద్దిసేపటి క్రితం మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసారు. విషయం ఏమిటంటే, ఇప్పటికే సంక్రాంతి రేస్ లో మహేష్ బాబు గుంటూరు కారం, నాగార్జున నా సామిరంగ, వెంకటేష్ సైంధవ్, తేజ సజ్జ హనుమన్ సినిమాలు ఉన్నాయి.
అయితే వాటితో పాటు ఉన్న ఈగిల్ మూవీ మాత్రమే తప్పుకోవడంతో కొందరిలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
దీనిని కావాలని ఒత్తిడి చేసి వెనక్కి పంపారు అనుమానం పలువురు రవితేజ ఫ్యాన్స్ లో ఉంది.
అయితే అటువంటిది ఏమి లేదని, తమ సినిమా కంటెంట్ బాగుండడంతో ఇంత కాంపిటీషన్ కంటే పక్కాగా మంచి డేట్ చూసుకుని వస్తే బెటర్ అని తామే భావించినట్లు ఈగిల్ మేకర్స్ టిజి విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిన్నటి ఫిలిం ఛాంబర్ మీట్ లో మీడియా ముందు తెలిపారు.
కాగా మంచి మనసుతో సంక్రాంతి రేస్ నుండి తప్పుకున్న ఈగిల్ టీమ్ కి మిగతా సినిమాల నిర్మాతలు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.
ఈ మూవీలో రవితేజ పవర్ఫుల్ రోల్ చేస్తుండగా అన్ని వర్గాల ఆడియన్స్ ని అలరించేలా దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని దీనిని అద్భుతంగా తెరకెక్కించారని, తప్పకుండా ఈగిల్ రిలీజ్ తరువాత అందరినీ ఆకట్టుకుని మంచి విజయం అందుకుంటుందని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.