Eagle Movie Review
నటీనటులు: రవితేజ, కావ్య థాపర్,అనుపమ పరమేశ్వరన్, వినయ్ రాయ్, నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల, అజయ్ ఘోష్ తదితరులు.
దర్శకుడు: కార్తీక్ ఘట్టమనేని,
సంగీత దర్శకుడు: డావ్ జాన్డ్,
సినిమాటోగ్రాఫర్‌లు: కార్తీక్ ఘట్టమనేని, కర్మ్ చావ్లా, కమిల్ ప్లాకి,
ఎడిటర్: కార్తీక్ ఘట్టమనేని.
నిర్మాత: టి జి విశ్వ ప్రసాద్,
రవితేజ హీరోగా కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన చిత్రం ఈగల్. ఈ రోజు రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూ చూద్దాం.
కథ :
చిత్తూరు జిల్లాలోని తలకోన ప్రాంతంలోని రెండు గిరిజన తెగలు సహదేవ వర్మ (రవితేజ ) విగ్రహాన్ని పెట్టుకొని, అతన్ని దేవుడిలా కొలుస్తూ ఉంటారు. అసలు ఈ సహదేవ్ వర్మ ఎవరు ?, ఎందుకు అతని గురించి పేపర్లో రాస్తే సీబీఐ రంగంలోకి దిగింది ?, ఇంతకీ, సహదేవ్ వర్మ వెనుక ‘ఈగల్’ కథ ఏమిటి ?, అసలు ‘ఈగల్’ సృష్టించిన విధ్వంసాలు ఏమిటి ?, ఈ మధ్యలో సహదేవ్ వర్మ.. రచన (కావ్య థాపర్)తో ఎలా ప్రేమలో పడ్డాడు ?, చివరకు ఆమె కోసం అతను ఏం చేశాడు ? అనేది మిగిలిన కథ.
విశ్లేషణ :
‘ఈగల్’ థీమ్ బాగున్నా.. ట్రీట్మెంట్ మాత్రం రెగ్యులర్ గానే సాగింది. నిజానికి, విజువల్స్, యాక్షన్ ఎలిమెంట్స్ సినిమా స్థాయిని పెంచినా.. స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే మాత్రం ‘ఈగల్’ను ఓ సగటు తెలుగు సినిమాగానే నిలబెట్టాయి. ఐతే, రవితేజ తన కొత్త లుక్ తో – ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్ తో ఈ సినిమాకు ఒక సరికొత్త ఎనర్జీ ఇచ్చాడు. ముఖ్యంగా తన పాత్రకు అనుగుణంగా తన నటనలో రవితేజ చూపించిన వేరియేషన్స్ చాలా బాగున్నాయి. మరో కీలక పాత్రలో నటించిన
అనుపమ పరమేశ్వరన్ పాత్ర కేవలం డౌట్లు అడగడానికే పరిమితం అయ్యింది. హీరోయిన్ గా కావ్య థాపర్ తన గ్లామర్ తో ఆకట్టుకుంది. ముఖ్యంగా లవ్ సీన్స్ లో ఆమె నటన బాగుంది. కానీ, ఆమె పాత్రకు నిడివే కరువైంది. ఇక వినయ్ రాయ్, నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు. అజయ్ ఘోష్ మాత్రం సినిమాలో కామెడీకి మెయిన్ పిల్లర్ గా నిలిచాడు.
మొత్తంగా ‘ఈగల్’ సినిమా కథనం బాగాలేదు. అలాగే, మెయిన్ కాన్ ఫ్లిక్ట్ ని ఇంట్రెస్ట్ గా ఎలివేట్ చేయలేకపోవడం, దీనికితోడు ఆడియన్స్ కి మెయిన్ క్యారెక్టర్స్ సరిగ్గా కనెక్ట్ కాకపోవడంతో మొత్తానికి ఈ సినిమా పూర్తి స్థాయిలో ఆకట్టుకోదు. కాకపోతే, ఫస్ట్ హాఫ్ లో రవితేజ ఇంట్రడక్షన్ సీక్వెన్సెస్, అలాగే ఫ్లాష్ బ్యాక్ మరియు క్లైమాక్స్ బాగానే ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్ :
రవితేజ నటన,
వైల్డ్ యాక్షన్ సీన్స్,
బీజీఎం
కొన్ని ఎమోషన్స్.
మైనస్ పాయింట్స్ :
రొటీన్ స్క్రీన్ ప్లే,
సెకండాఫ్ స్లోగా సాగడం,
సినిమాటిక్ టోన్ ఎక్కువ అవ్వడం,
కొన్ని చోట్ల లాజిక్ లెస్ డ్రామా.
తీర్పు :
వైల్డ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాగా వచ్చిన ఈ ‘ఈగల్’, ఫుల్ యాక్షన్ మోడ్ లో సాగినా ఆకట్టుకోలేక పోయింది. బోరింగ్ సీన్స్ అండ్ గ్రిప్పింగ్ నరేషన్ మిస్ కావడం, కథలో ఎక్కడా సహజత్వం లేకపోవడం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. కానీ, రవితేజ నటన మాత్రం ఆకట్టుకుంది. ఓవరాల్ గా ఓ వర్గం ప్రేక్షకులకు మాత్రమే ఈ సినిమా కనెక్ట్ అవుతుంది.
రేటింగ్ : 2.25 / 5
Also Watch Eagle Movie Review :
Also Read: Famous Telugu Producers : చాపకిందనీరులా తమిళంలోకి తెలుగు నిర్మాతలు…