Pooja Hegde : ఇక్కడ డోర్స్ క్లోజ్..

Pooja Hegde :

పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే మూడేళ్ల క్రితం వరుస ఫ్లాపులు అందుకుని నిరాశో లేదంటే అవకాశాలు రాలేదో కానీ మూడేళ్ల పాటు ఇంటి పట్టునే ఉండి పోయింది. ఆ తరువాత స్టార్ హీరో సూర్య సరసన ‘రెట్రో’, హిందీలో ‘దేవా’ చిత్రాలు చేసింది. రెండు సినిమాలు ఫ్లాప్. వెండితెరపై ఓ వెలుగు వెలిగిన ఈ భామ ఈ రెండు సినిమాలతో వెలవెల బోతోంది. టాలీవుడ్, బాలీవుడ్‌లలో వరుస సినిమాలతో తెగ బిజీగా ఉండేది. హైదరాబాద్ టు ముంబై కాలికి బలపం కట్టుకుని మరీ షూటింగ్‌ల కోసం తిరిగేది. అలాంటిది వరుస ఫ్లాపులతో అల్లాడిన ఈ భామ మూడేళ్ల పాటు ప్రపంచానికి కనిపించలేదు. వాస్తవానికి మూడేళ్ల తరువాత ప్రేక్షకుల ముందుకు వస్తోందంటే గట్టి కథతోనే వస్తోందని అంతా భావించారు.

కానీ అవకాశం దొరకడమే గగనమనుకుందో.. మరొకటో కానీ ఈ ముద్దుగుమ్మ మాత్రం ‘రెట్రో’, ‘దేవా’లకు ఓకే చెప్పేసింది. ముఖ్యంగా ‘రెట్రో’లో వింటేజ్ లుక్‌లో రుక్మిణి పాత్రలో మంచి పెర్ఫార్మెన్సే ఇచ్చింది కానీ కథలో బలం లేకుంటే అమ్మడు మాత్రం ఏం చేస్తుంది. అసలే ఒకసారి ఫ్లాప్ హీరోయిన్ ట్యాగ్ వస్తేనే ఇండస్ట్రీలో కష్టం. అలాంటిది రెండు సార్లు వస్తే పరిస్థితేంటి? అమ్మడి కెరీర్ ఇక మీదట ప్రశ్నార్థకమేనని టాక్ నడుస్తోంది. మొత్తానికి అభిమానులు అయితే తెగ ఆందోళన చెందుతున్నారు. ‘రెట్రో’తో అమ్మడికి టాలీవుడ్‌లో అయితే డోర్స్ క్లోజ్ అయినట్టే. కోలీవుడ్‌లో మాత్రం విజయ్ సరసన ఓ మూవీ చేస్తోంది. ఇది హిట్ అయితే కెరీర్ మళ్లీ గాడిన పడుతుంది. లేదంటే మాత్రం కాస్త కష్టమే. మొత్తానికి విజయ్ సినిమాపైనే అమ్మడు ఆశలన్నీ పెట్టుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *