సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఏజ్ పెరుగుతుందో.. తరుగుతుందో అర్థం కావడం లేదు. షైనింగ్ స్కిన్ టోన్‌తో కాలేజీ కుర్రాడిలా కనిపిస్తుంటాడు. ముఖ్యంగా ఏదైనా ఈవెంట్ లేదంటే ఫంక్షన్ జరిగితే అక్కడ మహేషే స్పెషల్ అట్రాక్షన్. తాజాగా అక్కినేని అఖిల్, జైనబ్ రవ్జీల మ్యారేజ్ రిసెప్షన్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ రిసెప్షన్‌కు సినీ ప్రముఖులంతా కుటుంబ సమేతంగా హాజరయ్యాడు. ఈ క్రమంలోనే మహేష్ కూడా తన సతీమణి నమ్రత, కూతురు సితారతో కలిసి సందడి చేశాడు. కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
సింపుల్‌గా ఒక టీషర్ట్‌లో మహేష్ కనిపించాడు. టీషర్ట్ అయినా కూడా మంచి హ్యాండ్సమ్గా కనిపించాడు. అయితే అంత సింపుల్ టీ షర్టుతో మహేష్ అటెండ్ అవడం చూసి అవాక్కైన అభిమానులు ఆ టీ షర్ట్ ధర ఎంతో తెసుకున్నారు. దాని ధర చూసి అంతా అవాక్కయ్యారు. సింపుల్‌గా కనిపించిన ఆ టీషర్ట్ ధర
అక్షరాలా రూ.1,50,000 అంట. మొత్తానికి మహేష్ అయితే ఆ టీషర్ట్‌తో హాట్ టాపిక్‌గా మారాడు. ప్రస్తుతం మహేష్.. ఎస్ఎస్ఎంబీ 29లో నటిస్తున్నాడు. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ సినిమా కోసం మహేష్ అయితే చాలా కష్టపడుతున్నాడని సమాచారం.