బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్ మంచు, నారా రోహిత్ హీరోలుగా నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘భైరవం’. విజయ్ కనకమేడల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో అదితి శంకర్, ఆనంది, దివ్యా పిళ్ళై హీరోయిన్లుగా నటించారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై కె.కె. రాధామోహన్ నిర్మించారు. ‘భైరవం’ మే 30న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ విజయ్ కనకమేడల విలేకరుల సమావేశంలో సినిమా విశేషాల్ని పంచుకున్నారు.
‘‘గరుడన్ కథని రిమేక్ చేయడానికి కారణం కథ నాకు కమర్షియల్‌గా నచ్చడమే. అలాగే ముగ్గురు హీరోలతో పని చేసే అవకాశం ఉండటంతో ఓకే చేశాను. సినిమాకు కావల్సిన కమర్షియల్ వ్యాల్యూస్ అన్నీ ఉన్నాయి. ఒరిజినల్ కంటే కూడా ఇది కొత్తగా, బావుందని ప్రేక్షకులు ఫీల్ అవుతారు. ఫస్ట్ ఈ కథ అనుకున్న వెంటనే సాయి గారిని ఫైనల్ చేసుకున్న మీదట రోహిత్ గారిని, మనోజ్ గారిని కలవగానే వారు కూడా ఓకే చెప్పారు. మనోజ్, రోహిత్ చాలా మంచి పెర్ఫార్మర్స్. బిగినింగ్ లో ముగ్గురు హీరోలను హ్యాండిల్ చేయడం కష్టమవుతుందేమో అనుకున్నా కానీ ముగ్గురూ ఆఫ్ స్క్రీన్ మంచి స్నేహితులు కావడంతో చాలా సపోర్ట్ చేశారు. అతిథి శంకర్.. కార్తీతో చేసిన సినిమా చూశాను. ఆమె పెర్ఫార్మెన్స్ నచ్చింది. అందుకే ఆమెను ఫైనల్ చేశా.
ఇది ఫ్రెండ్స్ మధ్య జరుగుతున్న డ్రామా కాబట్టి ఎంతమేరకు ఎంటర్టైన్‌మెంట్ అవసరమో అంతే పెట్టాం. మనోజ్ సెట్స్‌లో ఉంటే సందడిగా ఉంటుంది. ఇక శ్రీచరణ్‌తో ఇది నా రెండో సినిమా. మ్యూజిక్, బ్యాగ్రౌండ్ స్కోర్ అద్భుతంగా చేశాడు. ‘భైరవం’ అనేది కథ నుంచి వచ్చిన టైటిల్. సినిమాలో చిన్న డివోషనల్ టచ్ కూడా ఉంటుంది. ఒక గ్రామంలో ఒక గుడి.. దానికి క్షేత్ర పాలకుడు భైరవుడు.. ఆ రూపం నుంచి సినిమాకు ‘భైరవం’ అనే టైటిల్ పెట్టాం. ముందుగా మైసూర్‌లో రియల్ లొకేషన్స్‌లో షూట్ చేయాలనుకున్నా కానీ కుదరలేదు. మా ప్రొడ్యూసర్ గారి సపోర్ట్‌తో అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీ సెట్ వేసి చేశాం. అది అద్భుతంగా వచ్చింది. అలాగే చిరంజీవి గారి కోసం, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారి కోసం కూడా ఒక కథను సిద్ధం చేశాం. చిరంజీవి గారిని ఈ సినిమా గ్యాప్‌లో ఒకసారి కలవగా టైం ఇస్తామని చెప్పారు. దాని కోసం వెయిటింగ్’’ అని విజయ్ కనకమేడల చెప్పుకొచ్చారు.
ప్రజావాణి చీదిరాల