సినిమా ఇండస్ట్రీలో ఉండాలంటే సినిమాపిచ్చి ఉండాలి అంటారు. ఈయన ఆ పిచ్చికి హెడ్ మాస్టర్ లాంటోడు. దర్శకునిగా తన సినిమా ఆగిపోతే ఆ సినిమా విడుదల అవ్వకుండా మరో సినిమా దర్శకత్వం వహించే అవకాశం దాదాపుగా ఎవరికీ రాదు. తన దర్శకత్వంలో రెడీ అయిన 4 సినిమాలు విడుదల అవ్వకపోయినా మరో సినిమా చేసి ఆ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆయనెవరో కాదు మనసంతా నువ్వే సినిమాతో బ్లాక్ బస్టర్ దర్శకునిగా పేరు తెచ్చుకున్న దర్శకుడు వి ఎన్ ఆదిత్య. ఆకాశమంత సక్సెస్లు చూసిన తర్వాత రెయిన్బో అనే సినిమాతో తనలోని కలర్స్ అన్ని కోల్పోయారు. కట్ చేస్తే ఇప్పుడు ఫణి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో ఏం జరుగుతుంది. ఆ బ్యానర్ నిర్మాత విశ్వ ప్రసాద్ సహ నిర్మాత వివేక్ కూచిభొట్లకు మధ్య ఏం జరిగింది. వాళ్ళు ఆఫీసియల్ గా విడిపోతున్నప్పుడు నేను మాత్రం విశ్వ ప్రసాద్ వైపు ఉంటాను అని ఎందుకు అన్నారు. ఫణి మూవీ సినిమా కోసం 20 పాములను ఆడిషన్ చేయటం ఎందుకు? ఫణి సినిమా విశేషాలతో పాటు అనేక ఆసక్తికరమైన విషయాలు టాగ్ తెలుగు యూట్యూబ్ పోడ్కాస్ట్ లో మాట్లాడారు. వీఎన్ ఆదిత్య గారి పార్ట్-1 ఇంటర్వ్యూ ఇది. ఇంటర్వ్యూ బై శివమల్లాల
Also Read This : రాజీవ్‌కి రూ.360 కోట్ల అప్పు.. సుమ రియాక్షన్‌తో గుండె ఆగినంత పనైంది: హర్షవర్థన్
