Director Harsha :
సినిమా మేకింగ్‌ను దగ్గరినుండి చూసి ప్రేమలో పడితే ఆ ప్రేమ మనతో జీవితాంతం ఉంటుంది అనటానికి ఖచ్చితమైన ఉదాహరణే ఈ డైరెక్టర్ స్టోరీ.
చిన్నప్పటి నుండి తన ఇంటి చుట్టుపక్కల షూటింగ్ జరుగుతుంటే ఆ షూటింగ్‌లన్నీ చూసి తాను సినిమా దర్శకుడు కావాలని కలలుకన్నాడు.
ఆ కలలను నిజం చేసుకోవటానికి తాను అనేక ఉద్యోగాలు చేశాడు. హీరోలంతా రెగ్యులర్‌గా చాలా బిజీగా ఉంటారు.
విమానాల్లో ప్రయాణించేటప్పుడు మాత్రం ఫ్రీగా దొరుకుతారేమో అనుకుని ఎయిర్‌లైన్స్‌లో జాబ్ చేశాడు.
అనుకున్నట్లుగానే ఎయిర్‌పోర్ట్‌లో పరిచయం అయిన వ్యక్తితో సినిమా ట్రావెల్ చేశాడు.
ఆ వ్యక్తి తర్వాత ఏకంగా కొత్త దర్శకులు దేవుడులా చూసే పూరి జగన్నాథ్‌తో తన కథ మొదలైంది.
అందుకే ఈ దర్శకుని స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది.
ఆయన స్టోరీలానే తాను దర్శకత్వం వహించిన తొలి సినిమా ‘14 రోజులు గర్ల్‌ఫ్రెండ్ ఇంట్లో’ కూడా వెరైటీగా అనిపించింది.
ఆ దర్శకుని పేరు హర్ష. కలలు అందరూ కంటారు. అవి నేరవేర్చుకోవటానికి ఎంత దూరమైనా వెళ్లేవాళ్లు చాలా తక్కువమందే ఉంటారు.
అలాంటి టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ పర్సనల్ స్టోరీని ఎక్స్‌క్లూజివ్‌గా ట్యాగ్‌తెలుగు యూట్యూబ్ ఛానల్‌లో చూసేయండి.
ఈ ఇంటర్వూ చూసిన ఎవరైనా అమ్మో హర్షాకి ఇంత టాలెంట్ ఉందా?
అని ముక్కున వేలేసుకుంటారు. మనోడిదగ్గర అంత సరుకుంది మరి.
అందుకే మీరు ఓసారి ఇంటర్వూను చూసేయండి. ఇంటర్వూ బై శివమల్లాల
Also Read This : నాని బెట్ గెలుస్తాడా ?
