మధ్యతరగతి స్థాయినుండి మధ్యతరగతి వారి మనసులను దోచే స్థాయికి ఎదిగిన అనిల్…..
తన తండ్రి ఆర్టీసి డ్రైవర్. నాలుగువేల జీతంలోని ఇంట్లోని ఒక సాదారణ మధ్యతరగతి కుటుంబం నుండి హైదరాబాద్‌కి వచ్చి చిత్ర పరిశ్రమలో మకాం పెట్టాడు.
ఇలా ఎంతోమంది చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తారు.
టాలెంట్ పరిపూర్ణంగా ఉన్న కొంతమందిని కళామతల్లి తన ముద్దుబిడ్డల్లా చూసుకుని ఆదరించి అందలం ఎక్కిస్తుంది.
అలా కళామతల్లి అందలం ఎక్కించిన కామెడి మాస్టర్ నటుడు, రచయిత, నిర్మాత, దర్శకుడు అనిల్ రావిపూడి.
ఇండస్ట్రీలో స్థిరపడి తనను తాను నిరూపించుకోవాలి అనుకున్నాడు. అనుకున్నది అనుకున్నట్లు సాధించి ఎంతోమందికి దిక్సూచిలా నిలిచాడు.
ముఖ్యంగా సినిమా పరిశ్రమలోని ప్రతి క్రాఫ్ట్‌ను ఔపోసన పట్టాడు.
ముందుగా ‘తమ్ముడు’ ఫేమ్ పి.ఏ.అరుణ్ ప్రసాద్‌తో చుట్టరికం ఉండటంతో ఆయన దగ్గర శిష్యరికం చేశారు అనిల్.
తర్వాత కెమెరామెన్ శివ దర్శకత్వం వహించిన ‘శౌర్యం’ సినిమాకి అసోసియేట్ దర్శకునిగా పనిచేశారు.
గోపిచంద్ హీరోగా నటించగా శ్రీవాసు దర్శకత్వం వహించిన సినిమా ‘శంఖం’కి డైలాగ్ రైటర్‌గా మారారు అనిల్.
మాటల రచయితగా ఎన్నో సినిమాలకు పనిచేసిన అనుభవం ఉండటంతో అనిల్ చెప్పిన కథను నమ్మి
తన సొంత బ్యానర్ యన్టీఆర్ ఆర్ట్స్‌లో ‘పటాస్’ సినిమాతో దర్శకునిగా తొలి అవకాశం ఇచ్చారు కల్యాణ్‌రామ్.
వచ్చిన తొలి అవకాశాన్ని చక్కగా వాడుకుని హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరో కల్యాణ్‌రామ్ కెరీర్‌కి సరైన హిట్‌ని అందించారు అనిల్.
ఇక అక్కడినుండి అనిల్ రావిపూడి పేరు మారు మోగిపోయింది.
ఇమ్మిడియేట్‌గా సాయిదుర్గా తేజ్ హీరోగా దిల్ రాజు నిర్మాతగా ‘సుప్రీమ్’ సినిమాని హిట్ చేసి దర్శకునిగా ద్వితీయ విఘ్నాన్ని దాటేశాడు అనిల్.
ఏడాదికి ఓ సినిమా చొప్పున చేసుకుంటూ రవితేజతో ‘రాజా ది గ్రేట్’, వెంకటేశ్ వరుణ్‌తేజ్ కాంబోలో ‘ఎఫ్–2’, ‘ఎఫ్–3’ సినిమాలను చేశారు.
మహేశ్‌బాబుతో ‘సరిలేరు నీకెవ్వరు’, బాలకృష్ణతో ‘భగవంత్ కేసరి’ సినిమాలను చేసి కెరీర్‌లో మంచి దూకుడు మీదున్నారు.
ఈ ఏడాది ఆయన వెంకటేశ్‌తో ‘సంక్రాంతికి వస్తున్నాం’ అంటూ వచ్చే సంక్రాంతికి థియేటర్లలో నవ్వులు పూయించటానికి రెడీ అయ్యారు.
డైలాగ్ రైటర్ కమ్ దర్శకునిగా రాణిస్తుండటంతో తన కెరీర్‌ను ఎప్పటికప్పుడు ఫుల్ స్వింగ్‌లో ఉంచుకుంటున్నాడు.
ముఖ్యంగా ‘దిల్’ రాజు వంటి పెద్ద ప్రొడ్యూసర్‌తో అనేక సినిమాలకు పని చెయ్యటంతో కెరీర్‌ను సేఫ్ అండ్ సెక్యూర్‌గా పెట్టుకున్నారు అనిల్ రావిపూడి.
తనతో తొలి రోజులనుండి స్నేహంగా ఉన్న ఎస్.కృష్ణ నిర్మాతగా మారితే తనకోసం ‘గాలి సంపత్’ అనే సినిమాకు స్క్రీన్‌ప్లే అందించి నిర్మాతగా మారారు అనిల్.
ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా సండది చేయలేదు.
అలాగే అనేక టీవి షోస్‌లో కనిపించి టీవి ఆడియన్స్‌కు కూడా తనదైన స్టైల్లో దగ్గరయ్యారు అనిల్ రావిపూడి.
ఈ రోజు జన్మదినం జరుపుకుంటున్న అనిల్ రావిపూడికి హ్యాప్పీబర్త్‌డే అంటూ తమ బెస్ట్ విశెష్‌ను తెలియచేస్తుంది ట్యాగ్‌తెలుగు.కామ్.
శివమల్లాల
Also Read This : డిసెంబర్ 20న అల్లరినరేశ్ ‘బచ్చలమల్లి’…
