Dilraju Dreams :
ప్రముఖ నిర్మాత దిల్‌రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణ సంస్థలో అనేక విజయవంతమైన టాలీవుడ్ సినిమాలు నిర్మించి
సక్సెస్‌ఫుల్ నిర్మాతగా భారతదేశం అంతటా పేరు తెచ్చుకున్నారు.
వాళ్ల ఫ్యామిలీలోని పిల్లలు రాజుగారి కూతురు హన్సిత, తమ్ముడు కుమారుడు హర్షిత్‌లు నిర్మాతలుగా ఎదగాలనే సంకల్పంతో
తన పేరు మీద దిల్‌రాజు ప్రొడక్షన్స్ అనే మరో నిర్మాణ సంస్థను నెలకొల్పి అందులోను సినిమాలు తీస్తున్న సంగతి అందరికి తెలిసిందే.
అయితే ఆయన ‘‘దిల్‌రాజు డ్రీమ్స్’’ అని మరో నిర్మాణ సంస్థను పెడుతున్నట్లు హైదరాబాద్‌లో ప్రకటించారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అనేక విషయాలను వెల్లడించారు.
1. ఈ బ్యానర్ ఎందుకోసం..ఎవరికోసం అంటే… చాలామంది నేను 30ఏళ్ల క్రితం ఇండస్ట్రీకి వచ్చినప్పుడు చాలా ఇంట్రెస్ట్‌తో వచ్చాను.
ఆ సమయంలో డిస్ట్రిబ్యూటర్‌గా కెరీర్‌ను ప్రారంభించినప్పుడు ఒక్కో పని నేర్చుకునే క్రమంలో ఎన్నోసార్లు డబ్బులు పోగొట్టుకున్నాను.
2. కానీ నేను ఇక్కడే ఉండి పట్టుబట్టి నష్టపోయిన డబ్బును ఎలా రికవరి చేసుకోవాలో తెలుసుకున్నాను.
3. ప్రస్తుతం చాలమంది నిర్మాతలు సినిమా గురించి కనీస అవగాహన లేకుండా వచ్చి తమ డబ్బులు పోగొట్టుకుంటున్నారు.
4. ఎంతోమంది నటీనటులు, దర్శకులు అవకాశాల కోసం ఎంతోకాలంగా వేచి చూస్తున్నారు. అలా వచ్చే అందరికి నేను వ్యక్తిగతంగా టైమ్ ఇవ్వలేను.
అందుకోసం టాలెంట్ ఉన్న వారందరికి అందుబాటులో ఉండటమే లక్ష్యంగా మా దిల్‌రాజు డ్రీమ్స్ టీమ్ పనిచేస్తుంది.
5. 2025లో ఈ బ్యానర్‌పై ఒక 5 సినిమాలు నిర్మించాలని సంకల్పించాం. ముఖ్యంగా 24 శాఖలకు సంబంధించిన అన్ని కార్యకలాపాల్లో మా టీమ్ ఉంటుంది.
కథనుండి ఆర్టిస్టులవరకు అన్ని ఓకే అన్నాకే ఆ సినిమా ప్రారంభమవుతుంది.
6. దీనివల్ల వేస్టేజ్ తగ్గుతుంది. ఖచ్చితంగా సినిమాకి మంచి జరుగుతుంది. సినిమా ప్రారంభం నుండి రిలీజ్ వరకు ప్రతి దగ్గర మా దిల్‌రాజు డ్రీమ్స్ వర్క్ చేస్తుంది.
వ్యక్తిగతంగా వారానికి ఒకరోజు నేను ఈ ప్రొడక్షన్ చేసే కార్యకలాపాల్లో పాల్గొంటాను. ఇప్పటికే ఇద్దరు యన్‌ఆర్‌ఐ నిర్మాతలు మాతో చేతులు కలిపారు.
7. ఇప్పుడు అన్నిటికంటే విలువైనది టైమ్‌మాత్రమే. టైమ్ వేస్ట్‌కాకుండా క్వాలిటీతో సినిమాలు ఎలా తీయాలి అనే ప్రయత్నంలో ఉన్నాం.
అలాగే స్క్రిప్ట్ వర్క్ దశనుండే మీడియాలో రివ్యూలు రాసే రివ్వూ రైటర్లను భాగం చేసుకుని
సినిమా తీయకముందే కంటెంట్‌ను కరెక్ట్‌చేస్తే మరింత మెరుగైన కంటెంట్‌ను అందించవచ్చు అనే ఉద్ధేశ్యంతో
మీడియా వారిని భాగస్వాములుగా వచ్చి మా టీమ్‌తో చేరండి అని అడుగుతున్నాను.
8. కంటెంట్ ఈజ్ కింగ్ అని అందరికి తెలుసు. ఎంత మంచి కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కానీ ఓటిటిలను తట్టుకుని ప్రేక్షకులు థియేటర్‌కి రావాలంటే
చాలా కష్టమైన పరిస్థితిలో ప్రస్తుత సినిమాల పరిస్థితి ఉంది. దీనికి పరిష్కార మార్గం కూడా చూస్తాం.
9. త్వరలోనే మా బ్యానర్లో పనిచేసిన దర్శకులు, హీరోలతో కలిసి మెగా ఈవెంట్‌లా చేసి మార్కెట్‌లోకి విడుదల అవుతుంది దిల్‌రాజు డ్రీమ్స్.
10. సినిమా పరిశ్రమలో ఈ రోజు మామూలుగా ఉన్నోళ్లు 20 ఏళ్ల తర్వాత ఏ రేంజ్‌లో ఉంటారో ఎవరూ ఊహించలేరు.
మా బ్యానర్‌లో ఆర్య సినిమా తీసినప్పుడు మేమెవరు ఊహించలేదు ఇప్పుడున్న రేంజ్‌లో ఉంటామని. సుకుమార్, బన్నీ, నేను అందరం మీతో పాటే పెరిగాం.
అందుకే ఇకనుండి నేను అవుట్ బాక్స్ సినిమాలు నిర్మిస్తాను. అంటే పెద్ద బడ్జెట్,
స్టార్‌కాస్ట్‌లతో పాటు బాలీవుడ్‌లో కూడా వెంచరింగ్ చేయటానికి సిద్ధమవుతున్నా అన్నారు దిల్‌రాజు.
అంటే ఇదో టాలెంట్ హంట్‌లాంటిదే. ఎంతోమంది కొత్తవాళ్లకు ఈ ప్లాట్‌ఫాం ద్వారా మంచి జరగొచ్చు.
చూడాలి దిల్‌రాజు డ్రీమ్స్ ద్వారా ఎంతమంది అల్లు అర్జున్‌లాంటి హీరోలు ఎంతమంది సుకుమార్‌లు, బొమ్మరిల్లు భాస్కర్‌లు, బోయపాటిలు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తారో
వేచిచూద్దాం…ఆల్ ది వెరీ బెస్ట్ టు దిల్‌రాజు డ్రీమ్స్….
శివమల్లాల
Also Read This : బ్యాడ్ థంబ్‌నెయిల్స్‌పై అల్లు అర్జున్ ఫ్యాన్స్ సీరియస్ …