ఒక ప్రొడక్షన్ హౌస్ నుంచి 60వ సినిమాను ప్రకటించడమంటే చిన్న విషయమేమీ కాదు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ ఈ మైల్ స్టోన్‌కి చేరుకున్నారు. ఈ మూవీలో ‘రౌడీ బాయ్స్, లవ్ మీ’ చిత్రాలలో తన నటనతో ఆకట్టుకున్న ఆశిష్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాతో ఆదిత్యరావు గంగాసాని దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఓల్డ్ సిటీ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందనుంది. తాజాగా ఆశిష్ పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. లోకల్ గాయ్‌గా ఆశిష్ నటిస్తుండటంతో కథకు తగినట్టుగా గడ్డం.. డిఫరెంట్ హెయిర్ స్టైల్‌తో కనిపిస్తున్నాడు. ఈ చిత్రం కోసం ఇంకా మేకోవర్ కావాల్సి ఉందని మేకర్స్ చెబుతున్నారు. సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతూ, నిర్మాతలు న్యూ ట్యాలెంట్ కోసం ముఖ్యంగా హైదరాబాద్ యాసని చక్కగా మాట్లాడే వారి కోసం కాస్టింగ్ కాల్‌ని అనౌన్స్ చేశారు. ఈ నటీనటుల ఎంపిక అన్ని వయసుల నటులకు ఓపెన్‌గా ఉంటుంది. సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను మేకర్స్ త్వరలోనే వెల్లడించనున్నారు.
ప్రజావాణి చీదిరాల
Also Read This :శేఖర్ మాస్టర్ హుక్ స్టెప్స్‌పై ఆసక్తికర సమాధానమిచ్చిన నితిన్, భరత్