Hit 3 Review :
చిత్రం: ‘హిట్ 3: ది థర్డ్ కేస్’
విడుదల తేదీ: 01-05-2025
నటీనటులు: నాని, శ్రీనిధి శెట్టి, సముద్ర ఖని, రావు రమేష్ తదితరులు
డైరెక్టర్: శైలేష్ కొలను
ప్రొడ్యూసర్: ప్రశాంతి త్రిపిరనేని
బ్యానర్: వాల్‌పోస్టర్ సినిమా, యునానిమస్ ప్రొడక్షన్స్
మ్యూజిక్: మిక్కీ జే మేయర్
సినిమాటోగ్రఫీ: సాను జాన్ వర్గీస్
ఎడిటర్: కార్తీక్ శ్రీనివాస్ ఆర్
నేచురల్ స్టార్ నాని హీరోగా.. శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘హిట్ 3: ది థర్డ్ కేస్’. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించింది. దీనిని ముందు వచ్చిన రెండు భాగాలు మంచి సక్సెస్ అవడంతో ‘హిట్’ను ఒక ఫ్రాంఛైజీగా రూపొందిస్తున్నారు. పార్ట్ 2 ఎండింగ్‌లో అర్జున్ సర్కార్‌గా నాని కనిపించి ‘హిట్ 3’పై అంచనాలను పెంచేశారు. మరి ఆ అంచనాలను ఈ సినిమా అందుకుందా? ‘హిట్ 3’తో నాని హిట్ అందుకున్నాడా? చూద్దాం.
ఇంతకు ముందు రెండు భాగాలకు ఈ భాగానికి తేడా అయితే తప్పకుండా ఉంది. కథలో చాలా మార్పు ఉంది. కానీ ఆ మార్పును సరిగా చెప్పడంలో దర్శకుడు విఫలమయ్యాడనే చెప్పాలి. అసలైన కీ పాయింట్‌ను ప్రేక్షకులకు చెప్పలేదు. మరి ఈ విషయం నాని గ్రహించలేదా? ఎందుకు కేర్ తీసుకోలేదు? అనేది మాత్రం అర్థం కాలేదు. సముద్ర ఖని, రావు రమేష్ వంటి పెద్ద నటులను తీసుకుని కూడా వారిని దర్శకుడు సరిగా వినియోగించుకోలేకపోయారు. అది ఈ చిత్రంలో కీ పాయింట్‌ను వివరించడంలో దర్శకుడు మిస్ అవడంతో సినిమా అయితే అనుకున్న అంచనాలను రీచ్ అవడం కష్టమే. ఇక శ్రీనిధి శెట్టి చాలా అందంగా కనిపించింది. తొలి భాగమంతా ఈ ముద్దుగుమ్మను కేవలం హీరోయిన్ రోల్ కోసమే తీసుకున్నారా? అనిపిస్తుంది. సెకండ్ హాఫ్‌లో ఆమె ఏంటనేది చూపించారు. సినిమాలో వైలెన్స్ పార్ట్ వచ్చేసి బీభత్సం. ఒళ్లు గగుర్పొడిచే సీన్లు ఉంటాయి. చాగంటి ప్రవచనాలను మాత్రం సందర్భానుసారంగానే వాడారు. .
ఎవరెలా చేశారంటే..
ఈ సినిమా మొత్తం నాని వన్ మ్యాన్ షో చేశాడు. ఒకే వ్యక్తి పలు పాత్రలు చేశాడు. పోలీస్ ఆఫీసర్‌గా.. ఒక విలన్‌గానూ కనిపించాడు. పాత్రకే పోలీస్ ఆఫీసర్ కానీ ఎక్కడా యూనిఫామ్‌తో కనిపించడు. ఒక సీరియస్ రోల్‌ను నాని ఎలా పోషించగలుగుతాడా? లేదా? అనే సందేహం ఈ సినిమాతో ప్రేక్షకులందరికీ తీరుతుంది. శ్రీనిధి శెట్టి కూడా తన పాత్రలో చక్కగా ఒదిగిపోయింది. చివరలో పార్ట్ 2లో ముఖ్య పాత్ర పోషించిన మాగంటి శ్రీనాథ్ కనిపించి మెస్మరైజ్ చేశాడనే చెప్పాలి. ఇక మరో హీరో కూడా ఊహించని విధంగా కనిపించి మెప్పించాడు. ఈ హీరో ఎంట్రీ ఒక సర్‌ప్రైజింగ్‌గానూ.. అద్భుతంగానూ అనిపించింది. ఇక మిగిలిన పాత్రలన్నీ నామమాత్రమే.
చివరిగా… నాని ఫ్యాన్స్‌కి అయితే ఈ సినిమా ఓకే కానీ.. మిగతా ప్రేక్షకులకు ఈ సినిమా రుచించడం కాస్త కష్టమే.
రేటింగ్ : 2.5/5
ప్రజావాణి చీదిరాల