...

Captain Miller Review : రివ్యూ : కెప్టెన్ మిల్లర్   

Captain Miller Review:

నటీనటులు: ధనుష్, ప్రియాంక అరుల్ మోహన్, సందీప్ కిషన్, శివరాజ్ కుమార్, నివేదిత సతీష్ తదితరులు

రచన: అరుణ్ మతీశ్వరన్, మదన్ కార్కీ

దర్శకత్వం: అరుణ్ మతీశ్వరన్

ఛాయాగ్రహణం: సిద్థార్థ్ నూని

సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్

నిర్మాణ సంస్థ : సత్య జ్యోతి ఫిలిమ్స్

ధనుష్ హీరోగా, సందీప్ కిషన్ – శివ రాజ్ కుమార్ గెస్ట్  అప్పీరియన్స్ తో వచ్చిన ఈ తమిళ డబ్బింగ్ చిత్రం ఈ రోజు తెలుగులో రిలీజ్ అయ్యింది. సినిమా ఎలా ఉందో రివ్యూలోకి వెళ్లి తెలుసుకుందాం !

 

కథ :

భారత దేశాన్ని బ్రిటిషర్స్‌ పాలిస్తున్న నేపథ్యంలో జరిగిన కథ ఇది. ఓ వైపు బ్రిటిషర్స్‌ తో, మరో వైపు రాజపాలకులతో ఇబ్బందులు పడుతూ అంటరానితనం వారీగా గుర్తింపు బడి, బానిస బ్రతుకులు బతుకున్న గ్రామంలోనే అగ్ని (ధనుష్) కూడా పుడతాడు. తక్కువ జాతిలో పుట్టిన తాను, గౌరవం కోసం బ్రిటిష్ సైన్యంలో చేరి, అదే గౌరవం కోసం  బ్రిటిషర్స్ ను, రాజపాలకులను ఊచకోత కోసి, ఎట్టకేలకు అణగారిన వర్గాలను  ధైర్యంగా గుడిలో కాలు మోపేలా చేస్తాడు. ఈ మధ్యలో అగ్ని అసలు ‘కెప్టెన్ మిల్లర్’గా ఎలా మారాడు ? అనేది మిగిలిన కథ.

 

విశ్లేషణ :

ఇదొక బోరింగ్ పీరియాడిక్ యాక్షన్ ఫీస్ట్. కాకపోతే, కెప్టెన్ మిల్లర్ గా ధనుష్ నటన బాగుంది. పైగా డిఫరెంట్ క్యారెక్టర్ లో తన క్యారెక్టరైజేషన్ తో ఈ కెప్టెన్ మిల్లర్ ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా తన పాత్రలో వైల్డ్ షేడ్స్ ను ధనుష్ చాలా బాగా పలికించాడు. యాక్షన్ సీక్వెన్స్ లో అండ్  మిగిలిన ఎమోషనల్  సీన్స్ లో కూడా ధనుష్ సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో  తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ‘హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్’ పాత్ర  హీరోయిన్ కి తక్కువ, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కి ఎక్కువ అన్నట్టు సాగింది.

సందీప్ కిషన్, శివరాజ్ కుమార్ తదితరుల పాత్ర‌ల డిజైన్, వాటి ప‌రిచ‌యం కూడా ఆకట్టుకోలేదు.  అసలు శివరాజ్ కుమార్, సందీప్ కిషన్ లాంటి హీరోలను అతిథి పాత్రల్లో తీసుకునేటప్పుడు  ఆ పాత్రల్లో ఆ డెప్త్ ఉండాలి. కేవలం, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కోసమే వారిని పెట్టుకుంటే.. గూజ్ బంప్స్ కాదు,  ప్రేక్షకులకు నీరసం వస్తోంది. ఐతే, ప్లాష్ బ్యాక్ లో వచ్చే కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు సినిమా పై ఆసక్తిని పెంచాయి. కానీ, ద్వితీయార్థంలో క‌థ మ‌ళ్లీ నెమ్మ‌దిస్తుంది.

నిజానికి, కొన్ని సీన్స్ లో ఎమోష‌న్స్ పండినా… ప్ర‌తీ పాత్ర‌కూ  జస్ట్ జ‌స్టిఫికేష‌న్ ఇవ్వటానికి తప్ప ఏ ఎమోషన్  ఆ పాత్రల పై ఇంట్రెస్ట్ ను మాత్రం కలిగించలేదు. మొత్తానికి నరేషన్ స్లోగా ఉండటం కెప్టెన్ మిల్లర్ సినిమాకి  పెద్ద మైనస్. అలాగే  రెగ్యులర్ సీన్స్,  ఫస్టాఫ్ లో  కొన్ని చోట్ల వేరే యాక్షన్ సినిమాల  పోలికలు గుర్తుకురావడం ఈ  సినిమాలో మరో డ్రాబ్యాక్.  చివరగా పీరియాడిక్ డ్రామాగా సాగే  ఈ యాక్షన్ డ్రామా తన స్థాయికి తగ్గట్టు లేదు.

ప్లస్ పాయింట్స్ :

ధనుష్ యాక్షన్ అండ్  స్క్రీన్ ప్రెజెన్సీ,

యాక్షన్ విజువల్స్,

కొన్ని చోట్ల ఎమోషన్స్.

మైనస్ పాయింట్స్ :

బోరింగ్  అండ్ రొటీన్ యాక్షన్ డ్రామా,

రెగ్యులర్ సీన్స్ తో సాగే  స్లో నేరేషన్,

స్క్రిప్ట్ సింపుల్ గా  సిల్లీగా సాగడం,

తమిళ్ నేటివిటీ  ఎక్కువ అవ్వడం,

తీర్పు :

కెప్టెన్ మిల్లర్ అంటూ ప్యూర్ యాక్షన్ డ్రామా వ్యవహారాలతో వచ్చిన ఈ పీరియాడిక్ సినిమాలో ధనుష్ మాస్ యాక్టింగ్, కొన్ని ఎమోషన్స్  – యాక్షన్ సీన్స్ మాత్రమే బాగున్నాయి. ఇక మిగిలిన బాగోతం అంతా రెగ్యులర్ రొట్ట కొట్టుడు మేకింగ్ స్టైల్ తో రొటీన్ బోరింగ్ అండ్ సిల్లీ వ్యవహారాలతోనే సాగింది. ఓవరాల్ గా కెప్టెన్ మిల్లర్ నిరాశ పరిచాడు.

రేటింగ్ : 2 / 5

బోటమ్ లైన్ : ‘మిల్లర్’ లో మ్యాటర్ ‘నిల్’ !

Also Read : ఇట్లు మారేడుమిల్లి ప్రజానికం రివ్యూ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.