...

జీవితం ప్రారంభం అక్కడే.. ముగిసేది అక్కడే..

సుమ చిత్ర ఆర్ట్స్ బ్యానర్‌పై సుమయా రెడ్డి రచయితగా, నిర్మాతగా, హీరోయిన్‌గా నటించిన చిత్రం ‘డియర్ ఉమ’. సాయి రాజేశ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఏప్రిల్ 18న విడుదలైంది.ఈ క్రమంలో శనివారం నాడు చిత్రయూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించి ప్రేక్షకులకు థాంక్స్ చెప్పింది. ఈ కార్యక్రమంలో సుమయ రెడ్డి మాట్లాడుతూ .. ‘‘సినిమా సక్సెస్‌ఫుల్‌గా విడుదలవడమే నాకు పెద్ద సక్సెస్. మా సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ ఈ చిత్రాన్ని అంకితం చేస్తున్నాను. మా అమ్మ, తమ్ముడు, మా టీం సహకారం వల్లే ఈ స్థాయి వరకు వచ్చాను. హాస్పిటల్‌లోనే మన జీవితం ప్రారంభమై అక్కడే జీవితం ముగుస్తుంది’’ అని అన్నారు.

దర్శకుడు సాయి రాజేష్ మహదేవ్ మాట్లాడుతూ .. ‘‘తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ కూడా మంచి సినిమాను ఎంకరేజ్ చేసి సక్సెస్ చేస్తూనే ఉంటారు. మా చిత్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని మీడియాని, ఆడియెన్స్‌ని కోరుతున్నా’’ అని అన్నారు. రాజీవ్ కనకాల మాట్లాడుతూ .. ‘‘సుమయ రెడ్డి ఎంతో కష్టపడి డియర్ ఉమ సినిమాని చేశారు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. రాజ్ తోట కెమెరా వర్క్ బాగుందని అంతా మెచ్చుకుంటున్నారు. రథన్ గారి మ్యూజిక్‌కు ప్రశంసలు వస్తున్నాయి’’ అని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.