Dasari Narayana Rao:
కెప్టెన్ అంటే ఇలా ఉండాలి అని ప్రూవ్ చేసిన దర్శకుడు…
సినిమా పరిశ్రమలో ఊహించని అపజయాలు ఎన్నో ఉంటాయి.
దర్శకుణ్ని కెప్టెన్ ఆఫ్ ది షిప్ అని ఎందుకు కొనియాడతామంటే ఓ సినిమాకుకావలసిన 24 శాఖలకు సంబంధించి సరైన అవగాహనతో పనిచేస్తాడని.
ఓ సినిమాకు తక్కువలో తక్కువ సుమారు 100మందికంటే ఎక్కవమందే పనిచేస్తారు. ఈ 100మందికి సినిమా జరిగే సమయంలో దర్శకుడే అధిపతి కాబట్టి టీమంతా ఆయన్ని కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారు.
తెలుగు చిత్ర పరిశ్రమ అలాంటి వందలకొద్ది కెప్టెన్లను ప్రేక్షకులకు పరిచయం చేసింది.
అలా పరిచయం అయినా ఎందరో కెప్టెన్లు సినిమా పరిశ్రమకి వచ్చిన తొలిరోజుల్లో రానున్న రోజుల్లో వారి హవా అంతగా పెరుగుతుంది అని కలలో కూడా ఊహించి ఉండరు.
సినిమా దర్శకునిగా మారిన తర్వాత వారు నడిచి వచ్చిన దారులన్నింటిని గౌరవిస్తూ తమ జీవితంలో ఎదురైన అనేక సంఘటనలను సినిమాకు అన్వయిస్తారు.
సినిమా విడుదల తర్వాత ప్రేక్షకులు సినిమాలో నటించిన హీరోతోపాటు దర్శకునికి బ్రహ్మరథం పట్టి అందలం ఎక్కించి సింహాసనంపై కూర్చోపెడతారు.
సింహాసనంపై కూర్చున్న తర్వాత అక్కడినుండి కిందకు దిగటానికి ఎవరు ఇష్టపడరు.
కానీ, తమ తర్వాత సినిమాలు ప్రేక్షకుల నుండి ఊహించని విధంగా అభాసుపాలైనప్పుడు తెలియకుండానే కిందకు వచ్చేస్తారు. ప్రేక్షకులు, మీడియా ఓ దర్శకుడిని సింహాసనంపై కూర్చోపెట్టి రాజును చేస్తారు.
సినిమా తీయటంలో తేడావస్తే అదే ప్రేక్షకులు కెప్టెన్ కూర్చున్న ఆసనంపైనుంచి అమాంతం క్రిందకు తోసేస్తారు. ఇది ఎంతోకాలంగా అందరూ చూస్తున్నది, తెలిసినదే…
దాసరి నారాయణరావు…
దర్శకులకు ఇంతటి ఖ్యాతిని మూటకట్టిన తెలుగు దర్శకుడెవ్వరు అంటే నిస్సందేహంగా ఒకే ఒక్క పేరును చెప్పాల్సి వస్తుంది. ఆ పేరే దర్శకతర్న దాసరి నారాయణరావు.
సినిమా అంటే నటీనటులే కాదు, వారిని తయారుచేసి ప్రేక్షకుల దగ్గరికి తీసుకువెళ్లే దర్శకులే నిజమైన కెప్టెన్లు అని అనేక సందర్భాల్లో స్పష్టం చేసిన వ్యక్తి.
అలా అనటం కాకుండా తన సినిమాల ద్వారా సక్సెస్‌ను సాధించి ఆకాశంలోని మేఘాల్లో తన పేరుని ధైర్యంగా వేసుకున్న మొదటి వ్యక్తి ఆయనే.
ఆయనకు ముందు ఎంతోమంది గొప్ప దర్శకులు తెలుగు సినిమా పరిశ్రమలో అద్భుతమైన సినిమాలను తీశారు. కానీ వారంతా తాము చేసిన పనిని గొప్ప అని చెప్పుకోవటానికి ఆలోచించేవారు.
కానీ, ‘‘తాతమనవుడు’’ అనే చిత్రంద్వారా తెలుగు చిత్రపరిశ్రమకు దాసరి అనే వజ్రం దొరికింది. ఇక అక్కడనుండి వరుసగా 13 బ్లాక్‌బస్టర్ సినిమాలను అందించిన ఘనత ఆయనది.
తన ఇంటి దగ్గరికి వెళ్లాలంటే ట్రాఫిక్‌జామ్‌లా ఉండేదట ఆ రోజుల్లో ఆయన చుట్టూ అనేకమంది కొత్త, పాత నిర్మాతలు క్యూ కట్టి ఉండేవారని
మా సీనియర్ జర్నలిస్టులు ఆయన వైభోగాన్ని కళ్లకు కట్టినట్లు చెప్పేవారు, చూపించేవారు.
అలాంటి వైభోగాన్ని చూసిన దాసరి కూడా అనేక డిజాస్టర్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారు.
14వ సినిమా చాలా పెద్ద ఫ్లాప్. ఒక్క తూటా పేలితే పిచుకలన్నీ ఎగిరిపోయినట్లు నాటి నిర్మాతలంతా ఒక్కసారిగా జంప్.
కెప్టెన్ ఆఫ్ ది షిప్
ఆరోజు ఆ సిట్చువేషన్‌ని ఫేస్ చేసిన దాసరి చిన్న చిరునవ్వు నవ్వుకున్నారట. ఇదే నిజం కదా అని ఆయన్ని ఆయన ఓ సారి గిల్లుకుని చూసుకుని ఉంటారు.
యస్! దట్‌టైమ్ మై ఐడియా వాజ్ ఫెయిల్, నాట్ మీ అని కుండబద్దలు కొట్టి ఐయామ్ ది కెప్టెన్ ఆఫ్ ది షిప్.
ఓ సినిమా హిట్టయినా, ఫట్టయినా ఆ క్రెడిట్ అంతా దర్శకుడిదే అనే నగ్నసత్యాన్ని ప్రేక్షకులకి చెప్పారట. ఆ సక్సెస్ నాదే, ఈ ఫెయిల్ నాదే.
ఇకనుండి మంచి సినిమాలతో, కొత్త ఐడియాలతో మీ ముందుకు వస్తానని ప్రామిస్ చేశాడట. అయినాకూడా అప్పటి ప్రేక్షకులుకానీ, మీడియా కానీ ఆయన్ని చిన్నచూపు చూడలేదు.
కారణం తన గత చిత్రాల తాలూకు విజయాలు అయ్యుండొచ్చు, ఒకప్పుడు తాను వెలిగిన వెలుగు అయ్యుండొచ్చు…….
ఇదంతా ఘతం…ఐదు దశాబ్ధాల క్రితం 1972లో దర్శకునిగా ఎంట్రీ ఇచ్చిన దాసరి నారాయణరావుది నిజంగా గతమే.
ఆ రోజుల్లో క్రికెట్‌లో టెస్ట్‌మ్యాచ్‌లు జరిగేవి. ఒక్కో మ్యాచ్ ఐదురోజులు, మూడురోజులు ఐనా ప్రేక్షకులు ఎంజాయ్ చేసేవారు. 90ల తర్వాత వన్టేక్రికెట్‌కి ప్రేక్షకాధారణ పెరిగింది.
2000 తర్వాత అంతా 20–20నే. గ్రౌండ్‌లో ఉండేదెవడో పోయేదెవడో ఆ రోజు తన పర్‌ఫార్‌మెన్స్‌పై ఆధారపడి ఉండటాన్ని మనం చూస్తూనే ఉన్నాం.
ప్రస్తుతం తెలుగులో లీడ్ చేస్నున్న దర్శకుల పరిస్థితి కూడా అంతే. గతంలో మనం ఎటువంటి గొప్ప చిత్రాల్ని ప్రేక్షకులకు ఇచ్చాం అనేది ఎవరికి అవసరం లేదు.
దానికి తగినట్లుగానే సినిమాలు తీయాలి తప్ప మా గత చిత్రాలు గొప్ప సినిమాలు అని చెప్పి ఈ రోజున సినిమాను గట్టెక్కించాలంటే కష్టమే మరి.
మేకర్స్ ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని సినిమాలు తీస్తే బావుంటుంది. లేదంటే వచ్చే సినిమా రిజల్ట్ చూసి బావురుమనటం మీ వంతవుతుంది. తస్మాత్ జాగ్రత్త కెప్టెన్స్. ఆల్ ది వెరీ బెస్ట్…
శివమల్లాల…