ఓటీటీలోకి వచ్చేస్తున్న డార్క్ కామెడీ ఎంటర్‌టైనర్..

బాసిల్ జోసెఫ్‌, రాజేష్ మాధ‌వ‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం ‘మరణ మాస్’. డార్క్ కామెడీ జానర్‌తో రూపొందిన ఈ చిత్రం థియేటర్లలో అలరించింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో సైతం మెప్పించేందుకు సిద్ధమైంది. ఈ నెల 15న ఈ సినిమా సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ కానుంది. శివ ప్రసాద్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం వ్యంగ్యం, సస్పెన్స్, అసంబద్దత వంటి అంశాల కలయికతో రూపొందింది. ఈ సినిమా కత విషయానికి వస్తే.. ఈ సినిమా ఇద్దరు స్నేహితులకు సంబంధించినది. ఒక హత్యను ఇద్దరూ చూసినట్టుగా భావిస్తారు.

ఈ సినిమా కేరళ నేపథ్యంలో సాగుతుంది. ఈ సినిమా ఆద్యంతం ఆకట్టుకుంటుంది. స్థానిక రాజకీయాలు, దాని వెనుక దాగిన ఎజెండాలు, ఎవరూ ఊహించని సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఈ సంద‌ర్భంగా బాసిల్ జోసెఫ్ మాట్లాడుతూ .. ‘మరణ మాస్’ సినిమా తన హృద‌యానికి చాలా దగ్గరైన చిత్రమని.. దీనిలో వైవిధ్య‌మైన‌ హాస్యం, పాత్రలు, అనూహ్యమైన ట్విస్ట్‌లు ఉంటాయన్నారు. గతంలోనూ తను నటించిన ‘ప్రవీణ్ కూడు’ చిత్రానికి సోనీ లివ్‌లో అద్భుతమైన స్పందన వచ్చిందన్నారు. త‌ర్వాత ఇప్పుడు ఇదే ఓటీటీలో మ‌రోసారి మ‌రో వైవిధ్య‌మైన సినిమాతో ముందుకు రావ‌టం అనేది ఎంతో ఆనందంగా ఉందని బాసిల్ జోసెఫ్ తెలిపారు.

ప్రజావాణి చీదిరాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *