Daaku Maharaj :
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణను మరోసారి ఊర మాస్ క్యారెక్టర్ లో చూడబోతున్న చిత్రం ‘డాకు మహారాజ్’.
పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్ తో సరికొత్తగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దర్శకుడు బాబీ.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పై నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి బరిలో సందడి చేయడానికి సిద్ధమవుతుంది.
లేటెస్ట్ గా ‘డాకు మహారాజ్’ షూటింగ్ అంత పూర్తయ్యింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ అధికారికంగా ప్రకటించింది.
కొత్త సంవత్సరం జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది .
ఇప్పటికే ‘డాకు మహారాజ్’ నుంచి వచ్చిన టీజర్ గ్లింప్స్ కి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది.
తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి త్వరలో ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయనున్నారు మేకర్స్.
ఈ సినిమాలో బాలయ్యకి జోడీగా శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్య జైస్వాల్ నటించగా ఇతర కీలక పాత్రల్లో బాబీ డియోల్, చాందిని చౌదరి కనిపించనున్నారు.
సిద్ధంగా ఉండండి అంటూ సినిమా రిలీజ్ డేట్ ను మరోసారి గుర్తు చేశారు మేకర్స్.
బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో సూపర్ ఫామ్ లో ఉన్న నటసింహం బాలకృష్ణ ‘డాకు మహారాజ్’తో మరోసారి బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయనున్నారు .
సంజు పిల్లలమర్రి
Also read this : 30 ఏళ్ళ తరువాత తెలుగు డైరెక్టర్ తో ఏఆర్ రెహమాన్