Crime News :
మూడురోజులుగా గదిలో నిర్బంధించి చిత్రహింసలు
భర్త కష్టసుఖాల్లో భార్య భాగం పంచుకోవడమన్నది భారత వివాహ వ్యవస్థలో తరతరాలుగా కొనసాగుతున్న గొప్ప సంస్కారం. కుటుంబంలో ఎన్ని సమస్యలు వచ్చినా.. సమిష్టిగా పరిష్కరించుకుంటూ ప్రపంచానికే భారత సమాజం ఆదర్శంగా నిలుస్తోంది. కానీ, ఓ భార్య మాత్రం ఆస్తి కోసం భర్తను ఇనుప గొలుసులతో బంధించింది. మూడురోజులపాటలు గదిలో నిర్భందించి చిత్రహింసలకు గురిచేసింది. హైదరాబాద్ శివార్లలోని ఘట్‌కేసర్‌లో ఈ దారుణం చోటు చేసుకుంది. మూడు రోజుల తరువాత విషయం పోలీసులకు తెలియడంతో ఆయనకు విముక్తి లభించింది. ఘట్‌కేసర్‌లోని అంబేడ్కర్ నగర్‌కు చెందిన భారతమ్మ, పత్తి నరసింహ భార్యాభర్తలు. వారికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. సెంట్రింగ్ కాంట్రాక్టర్ అయిన నరసింహ తన భార్య పేరుతో ఉన్న స్థలంలో నరసింహ ఇంటి నిర్మాణం చేపట్టారు. దీనికోసం చేసిన అప్పులు తీర్చేందుకు నరసింహ తన పేరుపై ఉన్న మరో స్థలం అమ్ముతానని భార్యకు చెప్పారు. దీంతో దంపతుల మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో సంవత్సరం క్రితం ఆయన ఇల్లు వదిలి వెళ్లిపోయారు. అప్పటి నుంచి అతని ఆచూకీ లభించలేదు. గత నెల 30న నరసింహ యాదాద్రి భువనగిరి జిల్లా పడమటి సోమారంలో ఉన్నట్లు భారతమ్మకు తెలిసింది. కుమారులతో కలిసి వెళ్లి భర్తను ఇంటికి తీసుకొచ్చింది. అనంతరం నరసింహను గదిలో వేసి ఇనుప గొలుసులతో కట్టేసి తాళం వేసింది. ఇంటి స్థలాన్ని తన పేరుపై రిజిస్ట్రేషన్ చేయాలని అతడిని చిత్రహింసలు పెడుతున్నది. అయితే ఈ తతంగాన్నంతా వీడియో తీసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికున్న పోలీసులు నరసింహను విడిపించి స్టేషన్‌కు తరలించారు. భార్య భారతమ్మ, కుమారుడు గణేశ్, రాజులపై కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు.
Also Read This Article : తెలంగాణలో గుడ్లు పెడుతున్న గాడిదలు !
