రామ్‌ జగధీష్‌ దర్శకునిగా గెలిచాడు, నిర్మాత నానిని గెలిపించాడు…

రివ్యూ– కోర్టు

విడుదల తేది– 14–03–2025

నటీనటులు– సాయికుమార్, శివాజి, ప్రియదర్శి, హర్ష్‌ రోషన్, శ్రీదేవి, రోహిణి, శుభలేక సుధాకర్, హర్షవర్ధన్, శ్రీనివాసరెడ్డి, శ్రీవాణి త్రిపురనేని, సురభి ప్రభావతి, రాజశేఖర్‌ తదితరులు

ఎడిటర్‌– కార్తీక శ్రీనివాస్‌

సినిమాటోగ్రఫీ– దినేశ్‌ పురుషోత్తమన్‌

సంగీతం– విజయ్‌ బుల్గాని

నిర్మాత– వాల్‌పోస్టర్‌ సినిమాస్‌

దర్శకత్వం– రామ్‌ జగదీష్‌

కథ– డబ్బుమదంతో ఉన్న

అధికారానికి అసహనం తోడైతే అంథకారం ఆవహిస్తుంది.

పరువు అనే కిరీటాన్ని తలకెక్కుంచుకుని మోసేవాడికి ఆ భారం అలంకారమైతే చూసేవాడికి అది డబ్బు మదంతో వచ్చిన విచ్చలవిడితనంలా కనిపిస్తుంది.

సరిగ్గా ‘కోర్టు’ సినిమాలోని మంగపతి (శివాజీ) పాత్ర ఇటువంటిదే. ఆ ఒక్కడి కోపం సినిమాలోని ప్రతి ఒక్కరికి శాపం.

అదే కోర్టు సినిమా డ్రామా పండటానికి ప్రధానమైన ఆయుధం. కథగా చెప్తే ‘కోర్టు’ సినిమాని రెండు ముక్కల్లో చెప్పొచ్చు.

అదే రెండు ముక్కల కథని ఆద్యంతం అద్భుతం అన్నట్లుగా చెప్పటమే దర్శకునిలోని కథకుడిని నిద్రలేపింది.

ఒక సినిమాకి రైటింగ్‌ అనేది ఎంత ప్రాణమో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది.

ఒక సాదారణమైన కథను అసాధరణ పాత్రలతో డ్రామా పండించటమెలాగో కోర్టు చిత్ర దర్శకుడు రామ్‌ జగధీష్‌ పట్టేశాడు.

హీరో నాని నిర్మాతగా అతని టాలెంట్‌కి తగిన గురితప్పని బాణాలను నటుల రూపంలో సినిమా టీమ్‌కు అంధించారు.

నటీనటుల పనితీరు : 

నాని అందించిన ఆ గురితప్పని భాణాలే ఈ సినిమాలోని నటులు సాయికుమార్, శివాజి, ప్రియదర్శిల నటనకు వందకు వంద మార్కులు పడ్డాయి.

మిగతావారంతా కూడా చక్కగా నటించారు. అదే కోర్టు సినిమా సీక్రెట్‌.

సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ తమ పాత్రల్లో జీవించేశారు.

నూతన జంట రోషన్, శ్రీదేవికి ఈ సినిమా తర్వాత యూత్‌లో మంచి ఫాలోయింగ్‌ పెరుగుతుంది అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

శివాజీని కరెక్ట్‌గా వాడుకున్నారు దర్శకుడు. అందుకే అతని క్యారెక్టర్‌ చుట్టూనే కథను అల్లుకున్న విధానం చాలాబావుంది.

సాయికుమార్‌ ఎంతో పరిణితిచెందిన లాయర్‌ పాత్రలో ఒదిగిపోయారు. ప్రియదర్శి సూపర్బ్‌ యాక్టింగ్‌తో కోర్ట్‌ సీన్‌ క్లైమాక్స్‌లో క్లాప్స్‌ కొట్టించారు.

టెక్నికల్‌ విభాగం : 

డ్రామా సినిమాలకు సంగీతం ప్రధానమైన ఆయుధంలా ఉండాలి.

కోర్టు సినిమాకు నేపధ్య సంగీతం చక్కగా కుదురుకుంది. ఎడిటర్‌ వర్క్‌ బావుంది. కెమెరా వర్క్‌ కథను ఎక్కడా ఇబ్బందిపెట్టలేదు.

ఈ సినిమాకు ప్రధాన బలం కథనం. ఏ సినిమాకైనా కథనం బావుంది అంటే సినిమాలోని డైలాగ్స్‌ చాలా బావుంటాయి.

ఈ సినిమాలోని డైలాగ్స్‌కి వందకి వంద మార్కులు.

కోర్టురూమ్‌ డ్రామాని చాకచక్యంగా నడపటంలో దర్శకుడు రామ్‌ జగధీశ్‌ గెలిచేశాడు. నానిని గెలిపించాడు.

ప్లస్‌ పాయింట్స్‌ :

స్టోరీరైటింగ్, డైలాగ్స్‌
శివాజి, సాయికుమార్, ప్రియదర్శిల నటన
డైరెక్టర్స్‌ మూవీ

మైనస్‌ పాయింట్స్‌ :

ఫస్ట్‌హాఫ్‌ స్లో పేస్‌
రిపీటెడ్‌ సీన్స్‌

ఫైనల్‌ వర్డిక్ట్‌ :

ఈ కోర్టు ఆలోచింపచేస్తుంది….

రేటింగ్‌ : 3.75/5
శివమల్లాల

Also Read This : ఎయిర్‌లైన్స్‌ వయా పూరి టు డైరెక్టర్‌ స్టోరీ ఇన్‌ ట్యాగ్‌తెలుగు….

Court Movie Review
Court Movie Review

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *