Congress R Tax :
ఇప్పటికే దీనిపై బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఆరోపణలు
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం R ట్యాక్స్ వసూలు చేస్తోందా? ఈ విషయమై బీజేపీ శాసనసభా పక్షనేత మహేశ్వర్ రెడ్డి చేసిన ఆరోపణలు నిజమేనా?
అంటే ప్రత్యర్థి పార్టీగా బీజేపీ ఈ ఆరోపణలు చేయవచ్చేమోగానీ.. నిన్నటిదాకా సొంత పార్టీలో ఉన్న నేత అయిన బక్క జడ్సన్ కూడా ఇది నిజమేనంటూ తాజాగా స్టేట్ మెంట్ ఇవ్వడం సంచలనంగా మారింది.
వారం రోజుల క్రితం మహేశ్వర్ రెడ్డి ఈ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. R ట్యాక్స్ అంటే రేవంత్ ట్యాక్సా? రాహుల్ ట్యాక్సా? రాజీవ్ ట్యాక్సా? అని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికే రూ.1,500 కోట్లు డబ్బులు పంపించారని.. ఇంకా రూ.500 కోట్ల పంపటం కోసం ఈ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.
ఈ చిట్టా మొత్తం తమ వద్ద ఉందని తెలిపారు. సందర్భం వచ్చినప్పుడు అనీ బయట పెడతామన్నారు. అయితే తాజాగా.. కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జడ్సన్ కూడా రేవంత్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేసారు.
రూ.7000 కోట్ల రైతు బంధు నిధులను పక్కదారి పట్టించారని ఆయన ఆరోపించారు. ఈ నిధులను ఎక్కడికి డైవర్ట్ చేశారో సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలన్నారు.
పారిశ్రామికవేత్త మేఘా కృష్టారెడ్డి తమ్ముడు చిట్టి మీద రాసి ఇస్తే R ట్యాక్స్, B ట్యాక్స్ కట్ చేసి కాంట్రాక్టర్లకు డబ్బులు రిలీజ్ చేస్తున్నారన్నారు.
ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్కనా ? లేక మేఘా కృష్ణారెడ్డి తమ్ముడా ? అని ప్రశ్నించారు. కాగా.. కొత్తగా B ట్యాక్స్ పదం తెరపైకి రావటంతో రాజకీయ వర్గాల్లో చర్చ మెుదలైంది. B ట్యాక్స్ అంటే ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ట్యాక్సేనా అనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
నిజమేనంటూ బక్క జడ్సన్ సంచలన వ్యాఖ్యలు
కాగా, రెండ్రోజల క్రితం బక్క జడ్సన్‌ను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. ఆయన్ను ఆరేండ్లపాటు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ డాక్టర్ చిన్నారెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. కాంగ్రెస్ నాయకులకు కాకుండా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ఎంపీ టిక్కెట్లు ఇస్తున్నారన్న బక్క జడ్సన్ వ్యాఖ్యలను క్రమశిక్షణారాహిత్యంగా కాంగ్రెస్ అధిష్ఠానం భావించింది. ఆయన వ్యాఖ్యలపై సంజాయిషీ కోరుతూ షోకాజు నోటీసు జారీచేసింది. దీనికి జడ్సన్ ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందని క్రమశిక్షణా కమిటీ ఆయన్ను పార్టీ నుంచి ఆరేళ్ల పాటు బహిష్కరిస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది. అయితే తనను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం కాదని ప్రజలే రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని సస్పెండ్ చేస్తారని జడ్సన్ అన్నారు. కానీ, పార్టీ నుంచి సస్పెండ్ చేయడం వల్లే కాంగ్రెస్ ప్రభుత్వంపై జడ్సన్ ఆరోపణలు చేస్తున్నరని పార్టీ నేతలు అంటున్నారు.
Also Read This Article :కడియం చేతిలో బీఆర్ఎస్ అవినీతి చిట్టా?