తొలి చిత్రంతోనే అవార్డుల‌ను సొంతం చేసుకున్న య‌దు వంశీ, సందీప్ రాజ్

‘కమిటీ కుర్రోలు’ సినిమా ప్రయాణం మరో ముఖ్యమైన మైలురాయిని సాధించి సినిమా బృందానికి మాత్ర‌మే కాకుండా.. తెలుగు సినిమాల‌కు గ‌ర్వకార‌ణ‌మైన గుర్తింపును తీసుకొచ్చింది. ప్రతిష్టాత్మకమైన 70వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ కార్యక్రమంలో ఈ చిత్రం రెండు ప్రధాన అవార్డులు అందుకోవ‌టం విశేషం. సినిమాలో న‌టించిన సందీప్ సరోజ్‌కు ఉత్తమ తొలి హీరో (బెస్ట్ డెబ్యూ మేల్) అవార్డు, యదు వంశీకి ఉత్తమ తొలి దర్శకుడు (బెస్ట్ డెబ్యూ డైరెక్టర్)గా అవార్డులు వ‌చ్చాయి.

https://www.instagram.com/p/DVD0jHWEQTB

దక్షిణ భారత సినీ పరిశ్రమల్లో ప్రతిభను గౌరవించే అత్యంత ప్రతిష్టాత్మక వేదికల్లో ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ ఒకటి. ఇందులో క‌మిటీ కుర్రోళ్ళు సినిమాకు రెండు అవార్డులు రావ‌టమ‌నేది ఈ చిత్రానికి జాతీయ స్థాయి వ‌చ్చిన‌ గుర్తింపు, పరిశ్రమలో ల‌భించిన విశ్వ‌స‌నీయ‌త అని చెప్పొచ్చు. క‌మిటీ కుర్రోళ్ళు రెండు ముఖ్యమైన డెబ్యూ విభాగాల్లో అవార్డులు అందుకుంది. ఇది కొత్త ప్రతిభ ఎంకరేజ్ చేస్తూనే వైవిధ్య‌మైన క‌థను న‌మ్మ‌కంగా చెబితే ఎలాంటి ఆద‌ర‌ణ ఉంటుందనేది మ‌రోసారి తేట‌తెల్ల‌మైంది.

ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ సౌత్‌లో సందీప్ సరోజ్‌కు బెస్ట్ డెబ్యూ మేల్ అవార్డు దక్కడం ఆయన కెరీర్‌లో ఒక కీల‌క‌మైన ప‌రిణామ‌మ‌ని చెప్పొచ్చు. సినిమా క‌థ‌లోని ప్ర‌ధాన‌ సంఘర్షణను తన సున్నితమైన, భావోద్వేగాలకు దగ్గరగా ఉన్న నటనను క‌న‌ప‌రిచి ప్రేక్ష‌కుల‌ను మెప్పించినందుకు త‌న‌కు ఈ గుర్తింపు వచ్చింది. స్నేహం, అహం, నైతిక మార్పుల మధ్య తడబడే ఒక యువకుడి పాత్రను ఆయన ఎంతో సహజంగా, నిజాయితీగా పోషించారు. ఆయన నటన ప్రేక్షకులనే కాకుండా విమర్శకుల హృదయాలనూ గెలుచుకుంది.

ఈ అవార్డ్స్‌లో యదు వంశీకి బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ అవార్డు దక్కింది. ఇది ఆయ‌న త‌న క‌థ‌తో దేన్ని స్ప‌ష్టంగా చెప్పాల‌నుకున్నార‌నే విష‌యం, వైవిధ్య‌మైన ధైర్య‌మైన అంశాన్ని ఎంచుకున్న విధానాన్ని ద‌ర్శ‌కుడిగా త‌న ఆలోచ‌న‌న‌ను ఇది మ‌రింతంగా బ‌ల‌ప‌రిచింది. సామాజిక సందేశానికి కామెడీతో మిళితం చేసి, మ‌నసుని హ‌త్తుకునేలా స‌మాజంపై మ‌రింత అవగాహ‌న పెరిగేలా చ‌క్క‌టి క‌థ‌నంతో సినిమా రూపొందింది. చిన్న ప్ర‌య‌త్నంగా ప్రారంభ‌మైన ఈ సినిమాతో తొలి చిత్ర ద‌ర్శ‌కుడిగా ప్రేక్ష‌కుల‌తో పాటు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌ను కూడా అందుకున్నారు.

ఈ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ అందుకోవ‌టం ద్వారా కమిటీ కుర్రోళ్ళు చిత్రం ఇప్పటికే అందుకున్న అవార్డుల జాబితాలో మరో గొప్ప గుర్తింపు సొంతం చేసుకుంది. ఇది వ‌ర‌కే ఈ చిత్రం గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ 2024లో జాతీయ ఐక్యత, సామాజిక సమర‌స్యం, వెనుకబడిన వర్గాల అభివృద్ధిపై ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ అవార్డు తో పాటు ఉత్తమ తొలి దర్శకుడు అవార్డును గెలుచుకుంది. అలాగే దుబాయ్‌లో జరిగిన గల్ఫ్ అకాడమీ మూవీ అవార్డ్స్ 2025లో యదు వంశీకి ఉత్తమ తొలి దర్శకుడు అవార్డు లభించగా, నిహారిక కొణిదెలకు ఉత్తమ తొలి నిర్మాతగా గౌరవం దక్కింది. సైమా అవార్డ్స్ 2025లో నిహారిక కొణిదెల ఉత్త‌మ తొలి చిత్ర నిర్మాత‌(తెలుగు)గా , సందీప్ సరోజ్‌కు బెస్ట్ డెబ్యుటెంట్ యాక్టర్ (తెలుగు) అవార్డులు అందుకున్నారు.

నిహారిక కొణిదెల స‌మ‌ర్ప‌ణ‌లో పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మాణంలో, పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్లపై ఈ చిత్రం రూపొందింది. స‌మాజంలోని వాస్త‌విక ప‌రిస్థితుల‌ను చెబుతూనే ఎంట‌ర్‌టైనింగ్‌గా ఈ సినిమాను తెర‌కెక్కించారు.

ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్‌గా పని చేసిన ఎదురోలు రాజు, గోదావరి ప్రాంతానికి సంబంధించిన‌ సహజ దృశ్యాలను అద్భుతంగా కెమెరాలో బంధించారు. ఆయన విజువల్స్ కథకు స‌హ‌జ‌త్వాన్ని తీసుకొచ్చాయి. అలాగే సంగీత దర్శకుడు అనుదీప్ దేవ్, కథలో చోటుచేసుకునే భావోద్వేగ మార్పులను సున్నితమైన స్వరాలతో, నేప‌థ్య సంగీతంతో మ‌రింత గొప్ప‌గా తీర్చిదిద్దారు.ఈ సినిమా నిర్మాణ వ్యవహారాలను మన్యం ర‌మేష్ సమర్థవంతంగా నిర్వహించారు.

2024 ఆగస్టు 9న విడుదలైన కమిటీ కుర్రోళ్ళు సినిమా బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది. సుమారు రూ.9 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా, థియేటర్లలో రూ.18.5 కోట్ల వసూళ్లు సాధించింది. అలాగే నాన్ థియేట్రికల్ హక్కుల‌కు రూ.6 కోట్లు వ‌చ్చాయి. మొత్తంగా చూస్తే.. కలెక్షన్లు రూ.24.5 కోట్లకు చేరాయి. సినిమాకు వ‌చ్చిన మౌత్ టాక్‌తో మూవీ భారీ క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్ సాధించింది.

తన తొలి చిత్రంతోనే ఫీచర్ ఫిల్మ్ ప్రొడ్యూసర్‌గా నిహారిక కొణిదెల టాలీవుడ్‌లో ఒక ముఖ్యమైన మైల్‌స్టోన్‌ను క్రియేట్ చేశారు. ఆమె నటిగానే కాకుండా సామాజిక సందేశాల‌ను అందించే కథలను ముందుకు తెచ్చే ప్రొడ్యూసర్‌గా కూడా ప్రశంసలు అందుకున్నారు. ఈ విజ‌యంతో న్యూ టాలెంట్‌, డిఫ‌రెంట్ కాన్సెప్ట్ సినిమాను ఎంక‌రేజ్ చేయాల‌నే అంశం స్ప‌ష్టంగా వ్య‌క్త‌మ‌వుతోంది.

ఆంధ్ర ప్రాంతంలోని ఓ పల్లెటూరులో జ‌రిగే కథతో ఈ సినిమాను రూపొందించారు. స్నేహితుల మ‌ధ్య జ‌రిగే అనుకోని ఘ‌ర్ష‌ణ ఎలాంటి ప‌రిణామాల‌కు దారి తీసింద‌నేదే సినిమా. కొత్త న‌టీన‌టుల‌తో పాటు సీనియ‌ర్ న‌టీన‌టులైన సాయికుమార్, గోప‌రాజు ర‌మ‌ణ వంటి న‌ట‌న మ‌రింత బ‌లాన్ని చేకూర్చాయి.

* కమిటీ కుర్రోళ్ళు సినిమా ఇప్పుడు ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. దీంతో సినిమా థియేట్రికల్ విడుదల తర్వాత కూడా ప్రేక్షకులకు మ‌రింత చేరువ అవుతోంది.

*రాబోతున్న సినిమాలు

* రాకాస‌*
సంగీత్ శోభ‌న్‌, న‌య‌న్ సారిక న‌టిస్తున్న ఈ సినిమాను మాన‌స శ‌ర్మ తెరకెక్కిస్తున్నారు. సినిమా ఏప్రిల్ 3న రిలీజ్ అవుతుంది.

క‌మిటీ కుర్రోళ్ళు ద‌ర్శ‌కుడు య‌దు వంశీ ద‌ర్శ‌క‌త్వంలో కొత్త సినిమా.. ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి.

* ప్రొడ‌క్ష‌న్ నెం.4*
డెబ్యూ డైరెక్ట‌ర్‌తో 2026లో కొత్త సినిమా ప్రారంభం
*ద‌శాబ్దం పూర్తి చేసుకున్న సంస్థ‌

తెలుగు సినీ ప్రపంచంలో తొలి వెబ్ సిరీస్‌ను ప్రారంభించడం నుంచి అవార్డులు గెలిచిన ఫీచర్ సినిమాలను నిర్మించడం వరకు, పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ డిజిటల్, సినిమాటిక్ స్టోరీస్‌ చెప్పడంలో కొత్త మార్గాల‌ను క్రియేట్ చేస్తూ ద‌శాబ్ద కాలాన్ని పూర్తి చేసుకుంది.

స్పష్టమైన ఆలోచ‌న‌, న్యూ టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేయాల‌నే ఆలోచ‌న‌తో నిహారిక కొణిదెల వెబ్ నుంచి సిల్వర్ స్క్రీన్ వరకు తెలుగు సినిమాకు ఓ కొత్త భవిష్యత్తును నిర్మిస్తూ ముందుకు సాగుతున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *