ఎన్ఆర్ఐ కస్టమర్‌లకు సీఎంఆర్ జ్యుయలర్స్ బంపరాఫర్

ఎన్నో ఏళ్లుగా వస్త్ర రంగంలోనూ.. ఇటు జ్యుయలరీ రంగంలోనూ రాణిస్తూ జంట నగరాలైన సికిందరాబాద్, హైదరాబాద్ ప్రజల ఆదరాభిమానాలను చూరగొన్న సీఎంఆర్ సంస్థ ఇప్పుడు మరో అడుగు ముందుకేసింది. సీఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యుయలర్స్ వారి ఆధ్వర్యంలో సీఎంఆర్ జ్యుయలరీ (cmrjewellers.com) అనే వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. దీనిని ప్రముఖ సింగర్ సునీత, యాంకర్ సుమ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎండీ అల్లాక సత్యనారాయణ, ఎండీలు సునీతాకుమారి అల్లాక, అల్లాక గనేశ్వర్, అల్లాక రోహన్ పాల్గొన్నారు. సీఎంఆర్ ప్రారంభించిన ఈ వెబ్‌సైట్‌లో పది వేల కంటే ఎక్కువ డిజైన్స్‌తో కూడిన సంప్రదాయ అధునాత ఆభరణాలు అందుబాటులో ఉంటాయని సంస్థ యజమాన్యం తెలిపింది. ముఖ్యంగా సీఎంఆర్ జ్యుయలర్స్‌ వెబ్‌సైట్‌ను ఎన్‌ఆర్ఐ కస్టమర్‌ల కోసం ప్రారంభించినట్టు వెల్లడించారు.

ఇకపై నాణ్యతతో పాటు నమ్మకమైన బంగారు ఆభరణాలను ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆన్‌లైన్‌లో షాపింగ్ చేయవచ్చని సీఎంఆర్ యాజమాన్యం తెలిపింది. ఈ కార్యక్రమంలో సింగర్ సునీత, యాంకర్ సుమ ‘క్యారెట్ కాయిన్’ని పరిచయం చేశారు. ఏప్రిల్ 12 నుంచి అక్షయ తృతీయ వరకు సైనప్ చేసిన కస్టమర్‌లో ఒక లక్ష రూపాయల విలువ కలిగిన క్యారెట్ నాణేలను అందుకుంటారు. 11 నెలల సువర్ణప్రాప్తి పర్చేజ్ ప్లాన్‌లో మీ తొలి పేమెంట్‌గా క్యారెట్ కాయిన్స్‌ని వినియోగించుకోవచ్చు. హైదరాబాద్, సికింద్రాబాద్‌లోని సీఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యుయలరీ స్టోర్‌లలో ఏప్రిల్ 12 నుంచి అక్షయ తృతీయ వరకూ కొనుగోలు చేసే ప్రతి కస్టమర్‌‌కూ బంగారు నాణేలు, వెండి కాయిన్స్ గెలుచుకునే అవకాశంతో పాటు మరెన్నో అద్భుతమైన ఆఫర్‌లను సీఎంఆర్ జ్యుయలర్స్ అందిస్తుంది. మొత్తానికి ఈ వెబ్‌సైట్ ప్రారంభించి ఎన్‌ఆర్ఐ కస్టమర్‌లకు సీఎంఆర్ బంపరాఫర్ ఇచ్చినట్టే.

ప్రజావాణి చీదిరాల

Also Read This : కసి పట్టుదలతో ఈ సినిమా తీశారు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *