chevella :
దేశంలో పార్లమెంటు ఎన్నికలు దగ్గరపడుతున్నాయి.. రాజకీయం మరోసారి రంజుగా మారబోతోంది.
తెలంగాణలో ప్రభుత్వం మారిపోవడం, కాంగ్రెస్ పార్టీ బొటాబొటి మెజారిటీతోనే అధికారంలోకి రావడంతో పార్లమెంటు ఎన్నికలు కీలకంగా మారాయి.
అధికారం మళ్లీ తమదేనన్న ధీమాతో ఉన్న బీఆర్ఎస్ కు ప్రజలు షాకివ్వడంతో.. మళ్లీ తమ బలాన్ని చాటుకునేందుకు పార్లమెంటు ఎన్నికలను వేదికగా మార్చుకోవాలని ఆ పార్టీ భావిస్తోంది.
ప్రజలు తొందరపాటు నిర్ణయం తీసుకున్నారని, తమను ఓడించాలని వారికి లేదని ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావు వంటివారు పదే పదే చెబుతున్నారు.
పార్లమెంటు ఎన్నికల ద్వారా ఈ విషయాన్ని రుజువు చేయాలనే పట్టుదలతో ఉన్నారు.
మరోవైపు రాష్ట్రంలో మెజారిటీ ఎంపీ స్థానాలను గెలుచుకోవడం ద్వారా తమ పట్టు నిలుపుకొని, ప్రజలు తమవైపే ఉన్నారని చెప్పాలని కాంగ్రెస్ భావిస్తోంది.
ఈ నేపథ్యంలో.. ప్రస్తుతం అవసరం లేకపోయినా.. రాజకీయంగా రెండు పార్టీల మధ్య డైలాగ్ వార్ మొదలైంది.
అది బీఆర్ఎస్ పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్షల్లో కేటీఆర్, హరీశ్ రావు ప్రారంభించగా, కాంగ్రెస్ తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా కౌంటర్ మొదలుపెట్టారు.
ఇక బీజేపీ నేతలు.. ఇందులో తాము వెనకబడి పోతున్నామని భావించారో ఏమోగానీ క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగారు.
ఆ తరువాత 2019 ఎన్నికలకు ముందు కాంగ్రెస్
రానున్న ఎన్నికల్లో చేవెళ్ల నుంచి బీజేపీ తరఫున ఎంపీగా పోటీ చేయాలని భావిస్తున్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి.. నియోజకవర్గంలో చేపట్టిన పర్యటనతో రాజకీయ వేడి రాజుకుంది.
అది ప్రస్తుత బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డితొ వాగ్వాదానికి, ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేసేదాకా దారితీసింది.
2014 లోక్ సభ ఎన్నికల్లో చేవెళ్ల నుంచి బీఆర్ఎస్ తరఫున ఎంపీగా గెలిచి, ఆ తరువాత 2019 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లో చేరిన విశ్వేశ్వర్ రెడ్డి.. గత ఎన్నికల్లో హస్తం గుర్తుపై పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమిపాలయ్యారు.
అనంతరం కాలంలో చోటుచేసుకున్న పరిణామాలతో గత ఏడాదే బీజేపీలోకి వెళ్లారు. అక్కడి నుంచి ఈసారి కమలం గుర్తుపై పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల చేవెళ్ల నియోజకవర్గంలో పర్యటన చేపట్టారు.
ఇందులో భాగంగా పలువురు నాయకులు, కార్యకర్తలు, క్షేత్రస్థాయిలో స్థానిక ప్రజా ప్రతినిధులను కలిశారు.
అయితే విశ్వేశ్వర్ రెడ్డి కలిసిన వారిలో బీఆర్ఎస్ కు చెందిన, ఎంపీ రంజిత్ రెడ్డికి అనుచరుడిగా పేరున్న ఓ సర్పంచ్ కూడా ఉన్నారు.
దీంతో విశ్వేశ్వర్ రెడ్డి తన అనుచరులపై గురి పెట్టారన్న అభిప్రాయానికి ఎంపీ రంజిత్ రెడ్డి వచ్చారు.
కానీ, ఆ పరిస్థితిని చక్కదిద్దుకొని తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేయకుండా.. తన అనుచరుడిని ఎలా కలుస్తావంటూ విశ్వేశ్వర్ రెడ్డికి ఫోన్ చేసి ప్రశ్నించారు.
అందుకు విశ్వేశ్వర్ రెడ్డి కూడా ఘాటుగానే సమాధానం ఇవ్వడంతో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి వాగ్వాదానికి దారితీసింది.
ఈ క్రమంలో ఎంపీ రంజిత్ రెడ్డి కాస్త కటువుగా మాట్లాడటంతో.. ఆయన తనను బెదిరించారని, అసభ్య పదజాలంతో దూషించారని పేర్కొంటూ రంజిత్ రెడ్డిపై విశ్వేశ్వర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో ఒక్కసారిగా రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికలపై చర్చ మొదలైంది.

ఇంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహించడంతో
గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో చేవెళ్లకు ప్రత్యేకమైన స్థానం ఉండేది. ఆయన ఏ పని ప్రారంభించిన చేవెళ్ల నుంచే మొదలుపెట్టేవారు.
అప్పట్టో అక్కడి నుంచి అసెంబ్లీకి సబితా ఇంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహించడంతో ఆమెను అంతా చేవెళ్ల చెల్లెమ్మ అనేవారు.
అనంతర కాలంలో చేవెళ్ల అసెంబ్లీ స్థానం ఎస్సీ రిజర్వుడుగా మారగా, చేవెళ్ల లోక్ సభ స్థానం జనరల్ అయింది. తాజాగా లోక్ సభ ఎన్నికల వేడి రాజుకునేందుకు చేవెళ్ల వేదికయింది.
Also Read : రైలు ప్రయాణంలో దాగి ఉన్న అద్భుతమైన సదుపాయాలు!
