Cherasala Movie :
రామ్ ప్రకాష్ గున్నం దర్శకుడిగానూ.. హీరోగానూ నటించిన చిత్రం ‘చెరసాల’. ఈ చిత్రాన్ని ఎస్ రాయ్ క్రియేషన్స్ బ్యానర్‌పై కథ్రి అంజమ్మ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో శ్రీజిత్, నిష్కల, రమ్య తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే చిత్ర యూనిట్ తాజాగా మీడియా ముందుకు వచ్చింది. ఈ కార్యక్రమంలో డైరెక్టర్, హీరో రామ్ ప్రకాష్ గున్నం మాట్లాడుతూ .. ‘ఓ బంధం ఎలా ఉండాలి? రిలేషన్ షిప్లో ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదనే పాయింట్‌ను చూపించాను. ఈ సినిమా మంచి ఎమోషన్స్‌తో పాటుగా చక్కని వినోదంతో అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే ఉంటుంది’ అన్నారు.
హీరో శ్రీజిత్ మాట్లాడుతూ .. ‘ఈ సినిమా కోసం తెలుగు నేర్చుకున్నా. నేను తెలుగులోనే డబ్బింగ్ చెప్పాలని ప్రయత్నించాను. కానీ అది కుదరలేదు. సినిమా అద్భుతంగా వచ్చింది. నేను కన్నడలో ఇది వరకు సినిమాలు చేశాను. నన్ను నమ్మి మా దర్శకుడు నాకు అవకాశం ఇచ్చారు’ అని అన్నారు. హీరోయిన్ నిష్కల మాట్లాడుతూ .. ‘ఇది నాకు తెలుగులో తొలి చిత్రం. ఇందులో నేను ప్రియ అనే అద్భుతమైన పాత్రను పోషించాను. ఇంత మంచి సినిమాలో పని చేయడం ఆనందంగా ఉంది’ అన్నారు. నటి రమ్య మాట్లాడుతూ .. ‘చెరసాల సినిమాలో నటించడం ఆనందంగా ఉంది. మా చిత్రం ఏప్రిల్ 11న రాబోతోంది. ఈ మూవీకి పని చేసిన ప్రతీ ఒక్కరికీ ఆల్ ది బెస్ట్. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్’ అని అన్నారు.
ప్రజావాణి చీదిరాల