...

TS Secunderabad : కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి శ్రీగణేష్

TS Secunderabad :

సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ ఉప ఎన్నికలో కాంగ్రెస్ తరఫున పోటీ చేసే అభ్యర్థి ఖరారయ్యారు. కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నారాయణ్ శ్రీగణేష్ ను ఖరారు చేసినట్లు ఆ పార్టీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు.
నారాయణ్ శ్రీగణేష్ ఇటీవలే బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ గూటికి చేరిన సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నారాయణ్ శ్రీగణేష్ ను కంటోన్మెంట్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా సిఫారసు చేసింది. ఆ సిఫారసును కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆమోదించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంతో మరణించడంతో ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో జరిగే పార్లమెంట్ ఎన్నికలతో పాటే ఈ ఉపఎన్నిక కూడా జరగనుంది. అయితే గతేడాదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీ గణేష్ బీజేపీ అభ్యర్థిగా ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి బీఆర్ఎస్ చేతిలో పరాజయం పాలయ్యారు. అయితే ఆ ఎన్నికల్లో శ్రీగణేష్ 41,888 ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు. ఇదే స్థానం నుంచి అప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన గద్దర్ కూతురు వెన్నెల 20,825 ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచారు.

 

Also Read This Article : కడియం చేతిలో బీఆర్ఎస్ అవినీతి చిట్టా?

Producer SivaMallala Speech
Producer SivaMallala Speech

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.