Bihar CM Nitish Kumar :
టైమ్స్ అఫ్ ఇండియా లో బీహార్ సీఎం నితీష్ కుమార్ గురించి రాస్తూ ఒక ఇంటరెస్టింగ్ టైటిల్ ఇచ్చారు నితీష్ కుమార్ కి అదే సుల్తాన్ అఫ్ స్వింగ్
నిజం గా మంచి టైటిల్ పెట్టినందుకు అభినందనలు చెప్పాలి – రచయిత కు.
కానీ , ఇలాంటి సుల్తాన్ అఫ్ స్వింగులు, ఆధునిక రాజకీయాల్లో చాలా మంది ఉన్నారు.
ముఖ్యం గా, నితీష్ కుమార్ విషయం లోనే తీసుకుంటే, ఆయన్ని విడవలేక పోతున్న భా జ పాని కూడా ప్రశంసించాలి కదా !!! కదా !!!! పదేళ్ళలో అయిదు సార్లు!!! నిజం!!!
మరి ఈ విషయం లో, మన చంద్రబాబు గారు – బాగా వెనకబడ్డారు ఈ విషయంలో .
1985 , 1989 , 1994 , 1999 , 2004 , 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసారు . ఇప్పుడు 2024 కు కూడా మళ్లా ఉంటుందంటున్నారు .
గత సంవత్సరం ఇదే రోజుల్లో నా ప్రాణం పోయినా భా జ పాతో మళ్ళా కలవనంటే కలవను అని ఒట్టేసుకున్నారు – నితీష్ .
తప్పక అభివృద్ధి కోసం మాత్రమే ఇప్పుడు ఇరువురూ ఆ ఒట్లను గట్టు మీద పెట్టి , మళ్లా కలిసారు . లోకసభ ఎన్నకలను బట్టి 2025 లో మళ్ళా జట్లు ఉంటాయేమో చూడాలి మరి.
ఇంక మన బాబు గారు – – భా జ పా . 2019 ఎన్నికల ముందు , ఆ తర్వాత ఈరోజుకీ ఉప్పూ నిప్పు లాగా తిట్టుకుంటూనే ఉన్నారు .
నితీష్ విషయంలో తలుపులు మూసేసామని అమిత్ షా ప్రకటించారు . అలాగే మన చంద్రబాబుకీ తలుపులు తెరవమంటే తెరవమని ప్రకటించారు . తలుపులు మూసారు కానీ తలపులు మూసారో లేదో తెలవాలంటే మరో వారం ఆగాలి .
తలుపులు vs తలపులు
మన దేశంలో వీరు ముగ్గురే కాదు ; తమిళనాడులో మన మిత్రులు ఉన్నారు . కాంగ్రెస్ – డి ఎమ్ కే – ఏ డి ఎమ్ కే . తలుపులు మూసుకుంటారు , మళ్ళా తెరుస్తారు .
దేశం కోసం , ధర్మం కోసం , అభివృద్ధి కోసం వీరందరూ పడే పాట్లు చూస్తుంటే ప్రజల ఆలోచనలు ఎలాగా ఉంటాయి???
ఇక్కడ ప్రపంచం లో ఇద్దర్ని ప్రత్యేకించి చెప్పుకోవాలి.
ప్రపంచ రికార్డులను కైవసం చేసుకున్న ఇద్దరు మహామహులు . ఒకళ్ళు : ఎలిజబెత్ టేలర్ . ఈ ఫొటో ఆమెదే . ఆమె ఎనిమిది సార్లు పెళ్ళిళ్ళు చేసుకుంది .
ఒకరినే రెండు సార్లు చేసుకుంది . అంటే ఏడుగురితో కాపురం చేసింది . వారు : 1. Cornard Nichy 2. Michael Wilding 3. Mike Todd 4. Eddie Fisher 5. Richard Burton 6. John Warner 7. Larry Fortensky .
మనకు పురాణాల్లో , ఇతిహాసాల్లో ఎనిమిది మంది , వంద మంది భార్యలు ఉన్న వారు తెలుసు . కానీ , మహిళలు ఉన్నట్లు తెలియదు . అయితే , ఈమె ఒకేసారి ఏడుగురితో లేదు . ఒక్కొక్కళ్ళతో ఒక్కో సారి.
ఇక్కడ ఈమెతో పోలిక కాదు కానీ, నెంబర్ మాత్రం మ్యాచ్ అవుతూ,
ఈమెతో పోటీ పడగల ఏకైక నాయకుడు ఒక్కరు ఉన్నారు – మన దేశంలో కూడా.
ఈయన కూడా ఏడెనిమిది సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసారు . ఈయన కూడా ఆవిడ లాగానే . 2020 ఎన్నికల తర్వాత భా జ పాతో జత కట్టడం ఇది రెండో సారి . ఈసారయినా ఎక్కువ కాలం వారి రాజకీయ దాంపత్యం వర్ధిల్లాలని , ఈలోపు ఆయనకు ఎవరూ సైట్ కొట్టకూడదని (పార్టీ ల పరం గా ) కోరుకుందాము.