ఇదేం ట్విస్ట్.. థియేటర్లలో ఉండగానే ఓటీటీలోకి..

సినిమా విడుదలకు ముందు నిర్వహించే ప్రమోషన్స్‌లో చిత్ర యూనిట్ మొత్తం చెప్పే మాట ఒక్కటే.. ఓటీటీలో చూద్దాంలే అని వేచి చూడకండి. సినిమాను థియేటర్‌లో చూడండంటూ చెబుతుంటారు. అయితే సినిమా విడుదలైన నెలకో.. రెండు నెలలకో ఓటీటీలో విడుదలవుతుంది. కానీ ఈ సినిమా మాత్రం స్పెషల్. థియేటర్‌లలో ఉండగానే ఓటీటీలో ప్రత్యక్షం కానుంది. ఇంతకీ ఏంటా చిత్రం.. అంటారా? ఆ సినిమా మరేదో కాదు.. ‘భోల్ చుక్ మాఫ్’. ఈ సినిమాలో రాజ్ కుమార్ రావ్, వామికా గబ్బి హీరోహీరోయిన్లుగా నటించారు.

వాస్తవానికి ఈ సినిమా మే మొదటి వారంలోనే విడుదల కావాల్సి ఉంది. కానీ ఈ చిత్రాన్ని నేరుగా మే 16 నుంచి ఓటీటీలో విడుదల చేస్తామని అమెజాన్ ప్రైమ్ వెల్లడించింది. దీంతో ప్రముఖ మల్టీప్లెక్స్ సంస్థ రూ.60 కోట్ల మేర దావా వేసింది. దీంతో దిగి వచ్చిన నిర్మాతలు మే 23న థియేటర్లలో సినిమాను విడుదల చేశారు. విడుదలై రెండు వారాలు కూడా కాకముందే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లోకి వచ్చేస్తోందని టాక్. జూన్ 6 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. వాస్తవానికి ఇదొక ఆసక్తికరమైన కథ. టైమ్‌ లూప్‌లో చిక్కుకోవడమనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ టైమ్ లూప్ నుంచి హీరో ఎలా బయటపడతాడనేదే కథ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *