Bhairava’s Bujji is on the way
ప్రభాస్ ఇన్‌స్టాలో పెట్టిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో ఓ రచ్చ రేపింది. “డార్లింగ్స్! ఎట్టకేలకు మన జీవితాల్లోకి ఒక ప్రత్యేక వ్యక్తి రాబోతున్నారు. వేచి చూడండి!” అని ఆయన రాసిన ఈ పోస్ట్‌తో పాటు ఒక కారు ఫోటో కూడా పోస్ట్ చేశారు. దీంతో, ప్రభాస్ పెళ్లి చేసుకుంటున్నారా? లేదా కొత్త సినిమా ప్రకటిస్తున్నారా? అని అనేక ఊహాగానాలు షురూ అయ్యాయి.
కానీ, ఆ ‘ప్రత్యేక వ్యక్తి’ ఎవరో కాదు, ‘కల్కి 2898 AD’ సినిమా కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఒక కారు! ఈ సినిమాలో ప్రభాస్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కారుకు ‘బుజ్జి’ అని పేరు పెట్టారు.
మే 22న ‘బుజ్జి’ రివీల్
ప్రభాస్ ఇన్‌స్టా పోస్ట్ తో మొదలైన ఉత్కంఠకు తెర తీస్తూ, ‘బుజ్జి’ కారును మే 22న రివీల్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు.
‘కల్కి 2898 AD’
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్తో పాటు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటాని వంటి భారీ తారాగణం నటిస్తోంది. ఈ చిత్రం జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.