బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ హీరోలుగా విజయ్ కనకమేడల తెరకెక్కించిన చిత్రం ‘భైరవం’. ఈ సినిమా మే 30న థియేటర్లో విడుదలై మంచి సక్సెస్ సాధించింది. ఈ చిత్రంలో ఆదితి శంకర్, దివ్యా పిళ్లై, ఆనంది ప్రధాన పాత్రల్లో నటించారు. బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ త్రయం చేసిన పర్ఫామెన్స్కి ఆడియెన్స్ ఫిదా అయ్యారు. ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైంది.
మే 18న జీ5లో స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లో మంచి ఆదరణను దక్కించుకున్న ఈ చిత్రం ఇక ఓటీటీ ఆడియెన్స్‌ను మెప్పించేందుకు రానుంది. వెయ్యి కోట్లు విలువైన వారాహి అమ్మవారి ఆలయ భూముల మీద రాజకీయ నాయకుడు కన్నువేయడం, ఆ భూమిని కాపాడేందుకు ధర్మకర్త ముగ్గురు హీరోల చేసే ప్రయత్నాలు ఏంటి? ఈ ముగ్గురు హీరోల పాత్రలు చివరకు ఎలా ముగుస్తాయి? ఈ క్రమంలో ఎవరెవరు ఏ దారిని ఎంచుకుంటారు? అన్నది ఆసక్తికరంగా ఉంటుంది.
ప్రజావాణి చీదిరాల