ముద్దుగుమ్మలంతా తెలుగు తెరకు పరిచయమయ్యే తరుణం కోసం తపిస్తుంటారు. ఇక్కడ హీరోయిన్ అయి.. క్లిక్ అయితే చాలు.. ఇక తిరుగుండదని బ్యూటీల భావన. ఒకప్పుడు టాలీవుడ్‌లో క్లిక్ అయిపోయి.. బాలీవుడ్‌లో జెండా పాతాలని కలలు కనేవారు. ఇప్పుడు టైం మారింది. బాలీవుడ్ నుంచి వచ్చి మరీ టాలీవుడ్‌లో జెండా పాతేందుకు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ ముద్దుగుమ్మ కూడా తపించి తన కలను నిజం చేసుకుంది. ఆ ముద్దుగుమ్మకు ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ఆ ముద్దుగుమ్మ మరెవరో కాదు.. భాగ్యశ్రీ బోర్సే. ఈ అమ్మడు బాలీవుడ్ నుంచి టాలీవుడ్‌కి ట్రాన్స్‌పోర్ట్ అయ్యింది.
ఈ ముద్దుగుమ్మ కూడా తొలుత బాలీవుడ్‌లో ఒక సినిమా చేసి డైరెక్టర్ హరీష్ శంకర్ దృష్టిలో పడి టాలీవుడ్‌కి వచ్చింది. ఆ తరువాత అమ్మడి ఫేటే మారిపోయింది. తెలుగులో ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ చేతిలో ప్రస్తుతం మూడు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. అమ్మడి ఖాతాలో విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’.. రామ్ హీరోగా రూపొందుతున్న ‘ఆంధ్రా కింగ్’.. దుల్కర్ సల్మాన్, రానా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘కాంత’ ప్రాజెక్టులు ఉన్నాయి. ‘కాంత’ తెలుగు, తమిళ భాషల్లో రూపొందనుంది. ఈ మూడు సినిమాలతో భాగ్యశ్రీ ఆడియన్స్‌కు మరింత దగ్గరకానుంది. ఇవి కాకుండా మరో రెండు సినిమాలు లైన్‌లో ఉన్నాయి. అమ్మడికి అయితే డిమాండ్ బీభత్సంగా ఉంది.