‘అన్నన పాథియే’ అంటూ సోషల్ మీడియాలో ముఖ్యంగా ఇన్‌స్టాలో నెటిజనం ఊగిపోతోంది. కేవలం 1.02 నిమిషాల నిడివి ఉన్న ఈ పాట ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. కనీసం అర్థం కూడా తెలియని ఒక పాట ఇంతటి ఆదరణ దక్కించుకోవడం ఆసక్తికరంగా మారింది. కేవలం జనాలకు రిథమ్ నచ్చేసింది. అంతే ట్రెండింగ్‌లో నిలబెట్టారు. అసలు ఈ పాట ఎవరు పాడారు? ఎవరు పాడారు? వంటి విషయాలన్నీ తెలుసుకుందాం.
అన్నన పాథియే అనేది ఒక థాయ్ ఫోక్ సాంగ్. ఈ పాటను థాయ్ ప్రజలు తమ ప్రేమను వ్యక్తం చేసేందుకు ఈ పదాలను ఉపయోగిస్తూ పాటలు పాడతారు. ‘టోంగ్ బావో క్రాహ్మోమ్’ అనే ఆల్బమ్ కోసం తొలిసారిగా ఉపయోగించారు. ఈ పాటను సాక్ పక్నం అనే గాయకుడు ఆలపించారు. ఈ పాట బ్యాక్‌గ్రౌండ్ ఏమీ లేదు.. ఒక వ్యక్తి తన ప్రియురాలికి ప్రేమను హాస్యాస్పదంగా వ్యక్తపరుస్తూ దీనిని పాడారు. ఈ పాటకు తొలుత స్థానికంగా విశేషాదరణ లభించడంతో ‘ది హోలీ మ్యాన్ 3’ అనే సినిమాలో ఉపయోగించారు. ఈ సినిమా 2010లో రూపొందింది. ఆ తరువాత ఈ పాటకు మరింత ఆదరణ లభించింది. ఇక ప్రస్తుతం ప్రపంచం మొత్తాన్ని ఆకర్షించింది.
ఇంతకాలం తర్వాత ట్రెండింగ్‌లోకి ఎలా?
కొన్ని పాటలు సినిమా విడుదలయ్యాక వైరల్ కావు. కొన్ని ఏళ్లు గడిచిన మీదట సడెన్‌గా బీభత్సంగా వైరల్ అవుతుంటాయి. ఈ కోవకు చెందినదే అన్నన్నా పాథియా సాంగ్. నికెన్ సలింద్రి అనే యువగాయని కారణంగా ఈ పాటకు ఇటీవలి కాలంలో విశేషాదరణ లభించింది. నికెన్ ఇండోనేషియా దేశస్థురాలు. చిన్ననాటి నుంచే నికెన్‌కు సంగీతంపై ఆసక్తి ఎక్కువ. పైగా తండ్రి కూడా గాయకుడే కావడంతో ఇద్దరూ కలిసి ఎన్నో స్టేజ్ షోలు ఇచ్చారు. అయితే నికెన్ ఒక ఆర్కెస్ట్రా బృందంలో చేరి థాయ్‌లాండ్‌తో పాటు చుట్టు పక్కల నగరాల్లో వరుస ప్రదర్శనలు ఇచ్చింది. ఆమె పాడే ప్రతి పాటకు ఒక హుక్ స్టెప్‌ను జోడించి స్టేజ్‌పై డ్యాన్స్ చేసేది. అలా ఆమె పాడిన పాటలు వైరల్ అయ్యేవి. అలా వైరల్ అయ్యిందే ‘అన్నన పాథియే’ సాంగ్.