గండ్ర గొడ్డలి పట్టిన యమధర్మరాజు ఈ డాకు మహారాజ్
భగవంత్ కేసరి లాంటి హిట్ తరువాత బాలయ్య బాబు NBK 109 డాకు మహారాజ్ సినిమాతో మనల్ని అలరించడానికి సంక్రాతికి 12-01-2025 రిలీజ్ చేయనున్నారు..
వాళ్తేరు వీరయ్య సినిమా గత సంవత్సరం సంక్రాంతికి రిలీజ్ చేసి బాక్స్ ఆఫీస్ వద్ద హిట్ సాధించిన బాబీ కొల్లి ఈ సంవత్సరం డాకు మహారాజ్ తో రాబోతున్నారు.
ఈ సినిమాకి ముందు నుంచి అనేక పేర్లు తెరమీదకు వచ్చాయి కానీ ఫైనల్ గా ఈ సినిమాకి డాకు మహారాజ్ అనే పేరు ఫిక్స్ చేస్తూ ఈరోజు అధికారికంగా అనౌన్స్మెంట్ చేసారు చిత్ర యూనిట్ .
టీజర్ అయితే చాలా పవర్ఫుల్ గా ఉంది కళ్యాణ్ రామ్ ఈ సినిమాకి బాక్గ్రౌండ్ వాయిస్ ఇచ్చారు..
స్వయంగా నందమూరి బాలకృష్ణకు అభిమాని అయిన నాగ వంశీ నిర్మాణ సారధ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం మీద నందమూరి బాలకృష్ణ అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి.
దానికి తగ్గట్టుగానే థమన్ మరోసారి సంగీతం అందిస్తూ ఉండడంతో అఖండ మ్యాజిక్ రిపీట్ అవుతుందని అందరూ భావిస్తున్నారు.
దానికి తోడు నిన్ననే నాగ వంశీ అసలు బాలకృష్ణ గారి సినిమాలకి తమన్ మ్యూజిక్ ఎందుకు ఉండాలో ఈ టైటిల్ టీజర్ చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది అంటూ క్లారిటీ ఇచ్చారు.
Also Read This : టాలెంటే అందలాన్ని ఎక్కిస్తుంది…