Bahishkarana :
దేవినేని నెహ్రూ గారి వర్థంతికి గెస్ట్‌గా పిలిచి మంత్రులందరి ముందు స్టేజిపై కూర్చోపెట్టి ఆయన్ని తన తండ్రిలా ట్రీట్ చేశారట దేవినేని అవినాష్. ఒక నెలలో విడుదలైన సినిమాలో దేవినేని నెహ్రూగారిలా మరో నెలలో దివంగత ముఖ్యమంత్రి వై.యస్ రాజశేఖర్ రెడ్డి గారిలా మరో నెలలో నారా. చంద్రబాబునాయుడు గారిల వరుసగా మూడునెలల్లో మూడు సినిమాలు విడుదలయ్యాయి. మూడు పాత్రల్లో నటించిన నటుడు ఒక్కరే కావటంతో మీడియా ఆ నటుణ్ని బయోపిక్ స్టార్ అన్నది. ఏ పాత్ర చేసినా ఆ పాత్రలోకి ఒదిగిపోయే స్వభావం ఉండటంతో ‘పుష్ప’ సినిమాలో అదిరిపోయే పాత్ర చేశారు ఈ విజయవాడ అబ్బాయి శ్రీతేజ్. కట్ చేస్తే ‘బహిష్కరణ’ వెబ్ సిరీస్‌లో అంజలి, అనన్య నాగళ్లల సరసన మెయిన్‌లీడ్‌లో అవకాశం. ఎలాంటి పాత్రైనైనా తన శక్తివంచన లేకుండా ఫుల్ న్యాయం చేస్తాను అంటున్నారు శ్రీతేజ. జూలై 19న ముఖేష్ ప్రజాపతి దర్శకత్వంలో జీ5లో స్ట్రీమింగ్ జరుపుకోబోతున్న ‘బహిష్కరణ’ విశేషాలతో పాటు అనేక వ్యక్తిగత విషయాలను “ట్యాగ్‌తెలుగు” యూట్యూబ్ చానల్‌తో పంచుకున్నారు శ్రీతేజ్. ఇంటర్వూ బై శివమల్లాల
Also Read This : అన్ని రికార్డులను చెరిపేసిన కల్కి…ఆ ఒక్క రికార్డు తప్ప…