Ayodhya :
నిజానికి – మొట్టమొదటి సారిగా వీర బహదూర్ సింగ్ ముఖ్య మంత్రి గా ఉన్న సమైక్య ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం లో, రాజీవ్ గాంధీ, ప్రధాన మంత్రి గా ఉన్న టైం లో 1986 లో అయోధ్య గుడి తలుపులు తెరుచుకున్నాయి.
రాజీవ్ గాంధీ – దేశ ప్రధాన మంత్రి గా ఉన్న టైం లో ఆయన అయోధ్య గుడి, తలుపులు తెరుచుకున్నాయి.
అయోధ్య విషయం లో, రాజీవ్ గాంధీ ప్రభుత్వం పూర్తి సహకారం అందించిందని బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్. కే. అద్వానీ తన ఆత్మ కధ – మై కంట్రీ – మై లైఫ్ పుస్తకం లో స్పష్టంగా రాశారు.
1989 ఎన్నికలు ప్రచారాన్ని, రాజీవ్ గాంధీ అయోధ్య నుంచే ప్రారంభించారు ఆ సమయం లోనే, రాజీవ్ గాంధీ, రామ మందిరం కట్టి తీరుతామని ప్రకటించారు.
కాల క్రమేణా – మారిన సైద్దాన్తిక ఆలోచనలతో – కాంగ్రెస్ పార్టీ అయోధ్య విషయం లో దూరం జరిగింది- అయోధ్య ని సపోర్ట్ చేస్తే, మైనారిటీ ఓట్లు పోతాయని, భయపడింది.
సరిగ్గా ఇక్కడే – అద్వానీ తన రాధ యాత్ర ని ప్రారంభించి దేశం లో రామ మందిరం ఆకాంక్షల్ని పెంచి పెద్దవి చేశారు.
తర్వాత కాలం లో, అమిత్ షా – మోదీ ద్వయం, అయోధ్య ఇష్యూ లో సక్సెస్్ఫుల్ గా ముందుకు వెళ్లిన ప్రాసెస్ ప్రపంచం అంతా చూసింది.
అయోధ్య ఉత్సవానికి వెళ్లకుండా, కాంగ్రెస్ పార్టీ చారిత్రక తప్పిదం చేసిందనే చెప్పాలి. ఇక్కడ బీజేపీ ప్రతి పక్షాలకి, అయోధ్య ఆహ్వానం పంపి, ఒక సవాల్ విసిరింది.
అక్కడే – కాంగ్రెస్ పార్టీ, అయోధ్య కీ వెళ్లకుండా – బీజేపీ వేసిన ట్రాప్ లో పడింది.
కనీసం, కాంగ్రెస్ పార్టీ, యూ.పి. లో, కేంద్రం లో అధికారం లో ఉన్నప్పుడె, అయోధ్య తలుపులు మొట్ట మొదటి సారిగా తెరుచుకున్నాయని, దానికి రాజీవ్ గాంధీ ప్రధాని గా ఉన్నప్పుడు,
సంపూర్ణ సహకారం అందించారని, ఆ విషయాన్నీ, స్వయం గా అద్వానీ తన ఆత్మ కధ లో, రాసారని చెప్పడం లో ఫెయిల్ అయిందనే చెప్పాలి.
ఏది ఏమైనా, ఎవరు ఎన్ని చెప్పినా, నరేంద్ర మోదీ అనే ఒక మహోన్నత వ్యక్తి ప్రభావన్నీ అయోధ్య కు ముందు అయోధ్య కు తర్వాత అని, చెప్పుకోవాలి.
యావత్ భారత్ దేశాన్ని, కాదు – ప్రపంచాన్ని, రామ నామ స్మరణ తో నింపి, హరతులు ఇప్పించి,
భక్తి పరవాస్యం లో ఓలలాడించిన ఘనత, ఒక్క తాటి మీదకు ఐకమత్యం గా తెచ్చిన, భక్తి తో నింపిన నేర్పు, మోదీ గారికే చెందిందని చెప్పాలి.
ఇక నుంచి, ప్రపంచ చరిత్ర లో, అయోధ్య ఎపిసోడ్ తర్వాత – మోదీ పేరు సువర్ణక్షారాలతో లిఖించబడుతుంది అనడం అనేది అక్షర సత్యం.
Also Read :గ్రేటర్ లో కాంగ్రెస్ కు అంత వీజీ కాదు.. !
