...

Ayalaan: ‘అయలాన్’ ట్రైలర్

Ayalaan:

యువ నటుడు శివ కార్తికేయన్ హీరోగా అందాల నటి రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా యువ దర్శకుడు ఆర్ రవికుమార్ రచన, దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ అయలాన్.
సైన్స్ ఫిక్షన్ తో కూడిన యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ మూవీని కెజెఆర్ స్టూడియోస్ బ్యానర్ పై కేజేఆర్ గ్రాండ్ లెవెల్లో భారీ స్థాయిలో నిర్మించారు.
ఇక ఈ మూవీ నుండి ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, ఫస్ట్ లుక్ టీజర్,
సాంగ్స్ అన్ని కూడా అందరినీ ఆకట్టుకుని మూవీ పై శివకార్తికేయన్ ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా ఎన్నో అంచనాలు ఏర్పరిచాయి.
ఇంట్రెస్టింగ్ కథ, కథనాలతో తెరకెక్కిన అయలాన్ ట్రైలర్ ని కొద్దిసేపటి క్రితం మేకర్స్ రిలీజ్ చేసారు.
ఈ ట్రైలర్ లో భూమిని అందరి కోసం దేవుడు సృష్టిస్తే దానిని కొందరు తమ స్వార్ధం కోసం వాడుకోవడం అనే డైలాగ్ తో ప్రారంభం అవుతుంది.

అనంతరం స్పేస్ నుండి ఒక ఏలియన్ భూమి పై రావడం చూపించారు.

అయితే ప్రపంచ వినాశనానికి కంకణం కట్టుకున్న ఒకడి ఆట కట్టించేందుకు ఇక్కడికి వచ్చిన ఏలియన్ హీరోతో స్నేహం చేసి అనంతరం విలన్ ని అతడితో కలిసి ఎలా అంతం చేసింది అనే ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో ఈ మూవీ రూపొందినట్లు మనకు ట్రైలర్ ని బట్టి చూస్తే అర్ధం అవుతుంది.
అయితే ఈ ఏలియన్ అసలు ఎక్కడి నుండి వచ్చింది, దాని పూర్తి వివరాలు మనకు సినిమా చూస్తేనే కానీ తెలియవు. ముఖ్యంగా ట్రైలర్ లో గ్రాండియర్ విజువల్స్, యాక్షన్, ఫైట్ సీన్స్ వంటివి సూపర్ గా ఉన్నాయి.
Ayalaan
Ayalaan
శివ కార్తికేయన్ యాక్టింగ్, స్టైల్, డైలాగ్స్, ఫైట్స్ ట్రైలర్ లో బాగుండగా ఏ ఆర్ రహమాన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకుంది.
నిర్మాణ విలువలు కూడా బాగున్నట్లు తెలుస్తోంది.
ఇక అయలాన్ ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరికీ ఒకప్పుడు హృతిక్ రోషన్ నటించిన సూపర్ హిట్ మూవీ కోయి మిల్ గయా అయితే తప్పక గుర్తుకు వస్తుంది.
మొత్తంగా అయితే అయలాన్ ట్రైలర్ థ్రిల్లింగ్ యాక్షన్ విజువల్స్ తో అందరినీ ఆకట్టుకుని ఇప్పటివరకు మూవీ పై ఉన్న అంచనాలు అమాంతంగా పెంచేసిందనే చెప్పాలి.
ప్రస్తుతం యూట్యూబ్ లో ఈ ట్రైలర్ కి అందరి నుండి మంచి రెస్పాన్స్ లభిస్తోంది.
భాను ప్రియ, యోగిబాబు, ఇషా కొప్పికర్, తదితరులు కీలక పాత్రలు పోషించారు. కాగా మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు.
అయితే తమిళ్ లో పక్కాగా అదే రోజున రిలీజ్ అవుతున్న అయలాన్ కి తెలుగులో ఎంతమేర థియేటర్స్ లభిస్తాయో చూడాలి.
ఇప్పటికే సంక్రాంతికి నాలుగు తెలుగు సినిమాలు రిలీజ్ అవుతుండగా అదే రోజున సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం,
తేజ సజ్జ హను మాన్ కూడా వస్తున్నాయనేది తెలిసిందే.
Senior Actor Ravi Varma

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.