గత 3 సంవత్సరాల నుంచి అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న శ్రీరామ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఈ సారి అయోధ్యలో జరిగింది. ఈ వేడుకలో తెలుగు రచయిత, దర్శకుడు సత్యకాశీ భార్గవ, యువ దర్శకుడు కృష్ణ ఎస్ రామ అవార్డులు సొంతం చేసుకున్నారు. డైరెక్టర్ కృష్ణ వచ్చేసి రామ్ అయోధ్య అనే సినిమాను నిర్మించారు. ఈ సందర్భంగా సత్యకాశీ మాట్లాడుతూ.. తనకు నాలుగు అవార్డులు రావడం ఆనందదాయకమన్నారు. ఈ సందర్బంగా సత్యకాశీ భార్గవ మాట్లాడుతూ 4 అవార్డ్స్ రావడం చాలా ఆనందదాయకం అని తెలిపారు. శ్రీరామ అయోధ్య ఫిల్మ్ డైరెక్టర్ కృష్ణ మాట్లాడుతూ.. తన మొదటి చిత్రానికే ఇలాంటి ప్రెస్టీజియస్ అవార్డు రావడం చాలా ఆనందంగా, గొప్పగా భావిస్తున్నానని తెలిపారు. శ్రీరామ అయోధ్య ఫిల్మ్ గత ఏడాది ఏప్రిల్ 17న ఆహా తెలుగు ఓటీటీలో.. శ్రీమాన్ రామ దూరదర్శన్ నేషనల్ టీవీలో 2024లో విడుదలై ఇప్పటికీ కొనసాగుతూ నంబర్ -1 టీవీ షోగా రికార్డు సృష్టించింది.
అవార్డులు ఎవరికి వచ్చాయంటే..
1) బెస్ట్ డైరెక్టర్ (ఏనిమేషన్)-సత్యకాశీ భార్గవ (శ్రీమాన్ రామ )
2)బెస్ట్ కార్టూన్ ఏనిమేషన్ ఫిల్మ్ -శ్రీమాన్ రామ
3)బెస్ట్ మైధలోజికల్ డాక్యుమెంటరీ ఫిల్మ్ డైరెక్టర్ -కృష్ణ S రామ (రామ అయోధ్య)
4) బెస్ట్ కల్చరల్ స్టోరీ కాన్సెప్ట్ -సత్యకాశీ భార్గవ (రామ అయోధ్య)