Attitude Star :
ఆటిడ్యూడ్ అనగానే 99 శాతం మంది నెగిటివ్ మాటలానే తీసుకుంటారు. ఆ పదాన్ని అనేక రకాలుగా వాడొచ్చు.
అతని ఆటిట్యూడ్ చాలా మంచిదనో ఆమె మొదట్నుండి ఒకేటాంటి ఆటిట్యూడ్ మెయింటైన్ చేస్తుందనో రకారకాలుగా మాట్లాడుతుంటాం.
కానీ, ఆ పదం మనవైపుకి రాగానే కొంచెం ఇబ్బంది పడటం సర్వ సాదారణమైన విషయం.
కానీ ‘రామ్‌నగర్ బన్నీ’ సినిమాతో ఈ 99 శాతం మందిలో లేనివాడు ఒకడు చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇస్తున్నాడు.
అతను తన కెరీర్‌లో ఒక్క సినిమా కూడా చేయకుండానే స్టార్ అనే ట్యాగ్‌లైన్ సొంతం చేసుకున్నాడు.
స్టార్‌కు ముందు ధైర్యంగా ఆటిట్యూడ్ అనికూడా తగిలించుకుని ఆటిట్యూడ్ స్టార్ అంటూ ‘రామ్‌నగర్ బన్నీ’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు.
అతను పేరు చంద్రహాస్. టీవీలో ప్రభాకర్ ఎంతో పెద్ద స్టార న్న సంగతి అందరికి తెలిసిందే.
శ్రీనివాస్ మహత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి తన కొడుకును హీరోగా నిలబెట్టటానికి ప్రభాకర్ కుటుంబం సొంతంగా నిర్మించిన చిత్రమిది.
ఈ చిత్రం అక్టోబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా ట్యాగ్‌తెలుగు యూట్యూబ్ చానల్‌కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూలో చంద్రహాస్ మాట్లాడుతూ చాలా ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నారు.
తనకు నటించటమంటే ఎంతో ఇష్టమని నన్ను దగ్గరి నుండి చూసిన వారెవరు తప్పుగా అనుకోరని తెలియని వాళ్లే రకారకాలుగా మాట్లాడుతున్నారని
దానికి పెద్దగా ఫీలవ్వటం లేదని అన్నారు.
నా సాంగ్ చూసి ఎంతోమంది చాలా పాజిటివ్‌గా మెసేజ్‌లు పెడుతున్నారని సినిమా విడుదల తర్వాత
మరింత పాజిటివ్‌గా న న్ను ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటారని ఎంతో ఎమోషనల్‌గా చెప్పారు చంద్రహాస్. మీరు ఓ లుక్కేయండి.. ఇంటర్వూ బై శివమల్లాల
Also Read This : కల్కిలో ప్రభాస్ చెప్పిందే నిజమవుతుంది…