Shilpa Shetty News : శిల్పాశెట్టి దంపతుల ఆస్తులు జప్తు

Shilpa Shetty News :

బాలీవుడ్‌ నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్‌కుంద్రాకు ఎన్‌ఫోర్స్ మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) షాకిచ్చింది. క్రిప్టో కరెన్సీ, బిట్‌కాయిన్‌ మనీలాండరింగ్‌ కేసులో వారి ఆస్తులను జప్తు చేసింది.

ఇందులో శిల్పాశెట్టి పేరుపై ఉన్న ముంబై జుహూ ప్లాట్‌తోపాటు పుణెలోని బంగ్లా కూడా ఉన్నట్టు సమాచారం. అలాగే రాజ్‌కుంద్రాకు చెందిన ఈక్విటీ షేర్లను సైతం ఈడీ అటాచ్‌ చేసినట్లు వెల్లడించింది.

మొత్తం ఈ కేసులో రూ.98 కోట్ల విలువైన స్థిర, చర ఆస్తులను ఈడీ జప్తు చేసినట్టు తెలుస్తోంది.

2017లో రాజ్‌కుంద్రా తన స్నేహితులతో కలిసి బిట్‌ కాయిన్‌ ద్వారా అమాయక ప్రజలను మోసం చేశాడని, దాదాపు రూ. 6600 కోట్ల అక్రమంగా సంపాదించాడన్నది ఆరోపణ.

బిట్‌కాయిన్‌లో పెట్టుబడి పెడితే నెలకు పది శాతం లాభాలు వస్తాయయని ప్రజలను నమ్మించాడని, డబ్బులు చేతికి వచ్చాక ఇన్వెస్టర్లను మోసం చేశాడని ఈడీ గుర్తించింది.

ఈ మోసం బయటపడటంతో ఈడీ అధికారులు సదరు బిట్‌కాయిన్‌ సంస్థ, దాని ప్రమోటర్లపై కూడా కేసు నమోదు చేశారు. రాజ్ కుంద్రాపై మహారాష్ట్ర, ఢిల్లీ ఇతర ప్రాంతాల్లో కూడా పోలీసు కేసులు నమోదయ్యాయి.

ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో నమోదైన వివిధ కేసుల ఆధారంగా పీఎంఎల్‌ఏ కింద ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. ఈ క్రమంలో తాజాగా రాజ్‌కుంద్రా, శిల్పాశెట్టిల ఆస్తులను కూడా బిట్‌ కాయిన్‌ స్కామ్‌కు అటాచ్‌ చేసి ఆస్తులు జప్తు చేసింది. ప్రస్తుతం ఈ వార్త బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో హాట్‌టాపిక్‌గా మారింది.

రాజ్‌ కుంద్రా స్నేహితులు అరెస్ట్‌

ఈ కేసులో రాజ్‌కుంద్రాతో పాటు అతడి స్నేహితులు సింపీ భరద్వాజ్‌, నితిన్‌ గౌర్‌, నిఖిల్‌ మహాజన్‌ కూడా నిందితులుగా ఉన్నారు. వారు ముగ్గురూ ఇప్పటికే అరెస్ట్‌ అయ్యారు. ప్రస్తుతం వారు జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారు.

బిట్‌ కాయిన్‌ స్కామ్‌ కేసులో ప్రధాన నిందితుడైన అజయ్‌ భరద్వాజ్‌, మహేంద్ర భరద్వాజ్‌లు పరారీలో ఉన్నారు. ప్రస్తుతం వారి కోసం అధికారులు గాలిస్తున్నారు.

ఈ స్కామ్‌కు ప్లాన్‌ చేసిన మాస్టర్‌ మైండ్‌ అమిత్‌ భరద్వాజ్‌ 2022లో మరణించారు. అయితే ఆయన గతంలో రాజ్‌కుంద్రాకు 285 బిట్‌కాయిన్లు ఇచ్చినట్టు విచారణలో తేలింది.

వాటితో రాజ్‌కుంద్రా ఉక్రెయిన్‌లో బిట్‌కాయిన్‌ మైనింగ్‌ ఫామ్‌ ఏర్పాటు చేయాలని భావించాడట. కానీ, అది కుదరలేదు.

అయితే, ఇప్పటికీ ఆ బిట్‌ కాయిన్లు తనవద్దే ఉన్నాయని, వాటి ప్రస్తుత విలువ రూ.150 కోట్లుగా ఉన్నట్టు విచారణలో రాజ్‌కుంద్రా చెప్పినట్లు ఈడీ వెల్లడించింది.

ఈ క్రమంలోనే అతడి ఆస్తులను ఈడీ జప్తు చేసింది. కాగా, రాజ్ కుంద్రాపై గతంలో పోర్న్ వీడియో కేసు కూడా నమోదైన సంగతి తెలిసిందే.

ఈ కేసులో అతడు అరెస్ట్ అయి జైలుకు కూడా వెళ్లాడు. అప్పుట్లో ఈ వార్త తీవ్ర కలకలం రేపింది.

Also Read This Article : పిఠాపురంలో పవన్ కల్యాణ్ కు కలిసిరానున్న ఆ సెంటిమెంట్ ?

Latest Mallik Ram Interview
Mallik Ram Interview

Also Read This Article : ఐపీఎల్ కప్ బీజేపీదే.. కాంగ్రెస్‌కు ప్లేయర్స్ కూడా దొరకడం లేదు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *