సమీక్ష : దేవకీ నందన వాసుదేవ
విడుదల తేది : 22-11-2024
నటీనటులు : అశోక్ గల్లా, మానస వారణాసి, దేవదత్త నాగే
ఎడిటర్ : తమ్మిరాజు
సినిమాటోగ్రఫీ : ప్రసాద్ మురెళ్ళ, రసూల్ ఎల్లోర్
సంగీతం : భీమ్స్ సిసిరోలియో
మాటలు : బుర్ర సాయి మాధవ్
కథ : ప్రశాంత్ వర్మ
నిర్మాత : సోమినేని బాలకృష్ణ
దర్శకత్వం : అర్జున్ జంధ్యాల
కథ :
అశోక్ గల్లా (కృష్ణ) హీరోగా నటించిన రెండవ చిత్రం దేవకినందనా వాసుదేవ.
ఈ సినిమాలో ఒక పవర్ ఫుల్ మాస్ పాత్రలో నటించటంతో గోల్డెన్ స్పూన్ బాయ్ మాస్ పాత్ర ఏంటి? అనే సందేహంతో సినిమా చూడటం ప్రారంభిస్తాం.
డైలాగ్ చెప్పే దగ్గర కొంచెం తడబడం గమనిస్తాం. మానస వారణాసిని ( సత్య) చూడగానే మనసు పారేసుకుంటాడు కృష్ణ.
ఆమెను దక్కించుకునే క్రమంలో తనకు ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి? ఆ ఇబ్బందులను ఎలా సాల్వ్ చేసుకుంటాడు అనేది తెర పైనే చూడాలి.
దేవకినందనా వాసుదేవ సినిమాకి ప్రశాంత్ వర్మ కథ సాయిమాధవ్ బుర్రా మాటలు అందించటం సినిమాకి చాలా ప్లస్.
వారిద్దరి టాలెంట్ తో పాటు ఫైట్ మాస్టర్స్ కెమెరా ఎడిటింగ్ వర్క్స్ కరెక్టుగా కుదిరాయి.
దర్శకుడు అర్జున్ జంధ్యాల తను చెప్పాలనుకున్న కథను ఎక్కడా బోరు కొట్టించకుండా కట్టే కొట్టే తెచ్చే అన్నట్లు మూడే ముక్కల్లో తేల్చేశాడు.
అందుకే సినిమా చాలా ఫాస్టుగా ఉంటుంది. రెండు గంటల ఎనిమిది నిమిషాల్లోనే లవ్ స్టోరీ రివెంజ్ డ్రామాను చెప్పారు.
నటీనటుల పనితీరు :
యాంకర్ ఝాన్సీ పవర్ ఫుల్ మదర్ పాత్రలో నటించి మెప్పించారు.
మనసా వారణాసి తొలి చిత్రమే అయినా మంచి మార్కులు కొట్టేసింది.
ఫస్ట్ ఫిల్మ్ హీరో తో చాక్లెట్ బాయ్ లా ఉన్న అశోక్ రెండో సినిమాలో మాస్ సినిమాలకు కూడా పనికొస్తాను అని తనను తాను నిరూపించుకున్నాడు.
ఫైనల్ వర్డిక్ట్ :
దేవుడుని నమ్మేవాళ్ళు ఈ సినిమా చూడొచ్చు.
రేటింగ్ : 3/5
శివమల్లాల
Also Read This : నార్సింగిలో మారియో క్లెయిర్ సెలూన్ ప్రారంభోత్సవంలో బిగ్ బాస్ సెలబ్రిటీలు..