‘అర్జున్ S/O వైజయంతి’ ఎప్పుడు వస్తున్నాడంటే..

Arjun S/O Vyjayanthi :

కళ్యాణ్ రామ్, విజయశాంతి తల్లీకొడుకులుగా నటించిన చిత్రం ‘అర్జున్ S/O వైజయంతి’

నందమూరి కళ్యాణ్ రామ్ హైలీ యాంటిసిపేటెడ్ యాక్షన్-ప్యాక్డ్ ఫ్యామిలీ డ్రామా ‘అర్జున్ S/O వైజయంతి’.

ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించారు.

ఈ సినిమా ఏప్రిల్ 18న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది.

ఈ విషయాన్ని ప్రకటిస్తూ ఒక పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

రిలీజ్ డేట్ పోస్టర్‌లో కళ్యాణ్ రామ్‌ను ఇంతకు ముందెన్నడూ చూడని మాస్, యాక్షన్ అవతార్‌లో కనిపించాడు.

తన ఇంటెన్స్ ప్రెజెన్స్ సినిమాలోని క్యారెక్టర్ పవర్ ఫుల్ వ్యక్తిత్వాన్ని ప్రజెంట్ చేస్తోంది.

ఈ సినిమాకి రాబోయే వేసవి సెలవుల అడ్వాంటేజ్ కానున్నాయి.

సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్లలో జోష్‌ను పెంచేసింది.

సోహైల్ ఖాన్, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్, యానిమల్ పృథ్వీరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

ప్రజావాణి చీదిరాల

Also Read This : సినిమాలో బూతులు బాగా వాడినట్టున్నారంటూ సిద్దు జొన్నలగడ్డకు మీడియా షాక్

Actor Harsha Vardhan Podcast
Actor Harsha Vardhan Podcast

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *