RC 16 :
గేమ్ ఛేంజర్ రిలీజ్ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బుచ్చి బాబు డైరెక్షన్ లో సినిమా చేస్తున్నా విషయం తెలిసిందే.
స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చరణ్ మరోసారి తన మాస్ స్టామినా ఏంటో నిరూపించాలనుకుంటున్నాడు.
RC16 గా రాబోతున్న ఈ మూవీ కోసం బుచ్చి బాబు ప్లానింగ్ ఒక రేంజ్ లో ఉంది.
ముఖ్యంగా సినిమాకు ఆస్కార్ అవార్డ్ విన్నర్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ని కావాలని తీసుకున్నారట.
ఏఆర్ రెహమాన్ డైరెక్ట్ గా తెలుగు సినిమాకు మ్యూజిక్ అందించడం తక్కువుగా చూస్తూ ఉంటాం.
ఏఆర్ రెహమాన్ తెలుగు సినిమాల మీద అంతగా ఆసక్తి చూపించరు.
కెరీర్ స్టార్టింగ్ లో 2, 3 సినిమాలు చేసి మళ్లీ ఇన్నాళ్లకు స్ట్రైట్ తెలుగు సినిమాకు తెలుగు డైరెక్టర్ తో మ్యూజిక్ అందిస్తున్నారు.
అంతేకాదు తెలుగు దర్శకులతో పనిచేసి చాలా ఏళ్లు అవుతుంది. అప్పుడెప్పుడే బి.గోపాల్ తో గ్యాంగ్ మాస్టర్ సినిమాకు మ్యూజిక్ అందించారు.
ఐతే మధ్యలో తెలుగు సినిమాలకు చేసినా అది తమిళ దర్శకులు డైరెక్ట్ చేయడం వల్లే ఆయన ఒప్పుకున్నారు.
చివరగా గౌతం మీనన్ డైరెక్షన్ లో తెరకెక్కిన సాహసం శ్వాసగా సాగిపో సినిమాకు మ్యూజిక్ అందించాడు.
ఆ తర్వాత ఏ తెలుగు సినిమాకు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించలేదు.
బుచ్చి బాబు RC16 సినిమాలో సాంగ్స్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకోనున్నారు.
చరణ్, జాన్వి కపూర్ జంటగా నటిస్తున్న ఈ సినిమాలో శివ రాజ్ కుమార్ కూడా స్పెషల్ రోల్ లో నటిస్తున్నారు.
మొత్తానికి బుచ్చి బాబు ఏదో పెద్ద ప్లానింగే వేసినట్టు అర్థమవుతుంది.
గేమ్ ఛేంజర్ సినిమా వచ్చే సంక్రాంతికి రిలీజ్ అవుతుంది.ఆ తరువాత చరణ్ బుచ్చి సినిమాకు బల్క్ డేట్స్ ఇవ్వనున్నాడు.
ఈ సినిమా తర్వాత సుకుమార్ తో చరణ్ సినిమా ఉండబోతుందని తెలిసిందే.
పుష్ప తర్వాత సుకుమార్ చేసే ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఐతే సుకుమార్ చరణ్ తో సినిమా 2025 చివర్లో మొదలు అవుతుందని తెలుస్తుంది.
సంజు పిల్లలమర్రి