AP Elections : ముద్రగడ అలా.. కూతురు ఇలా

AP Elections :

పవన్ కల్యాణ్ విషయంలో తండ్రితో విభేదించిన క్రాంతి

కాపు ఉద్యమనేత, వైసీపీ నాయకుడు ముద్రగడ పద్మనాభంకు ఇంటిపోరు మొదలైంది. ఆయన కూతురు బార్లపూడి క్రాంతి.. తండ్రి అభీష్టానికి వ్యతిరేకంగా వెళ్తున్నారు.

సీఎం జగన్ సూచన మేరకు పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు వ్యతిరేకంగా ముద్రగడ పనిచేస్తుండగా.. క్రాంతి మాత్రం తాను పవన్ గెలుపు కోసం పని చేస్తానని ప్రకటించారు.

అంతేకాదు.. తండ్రి వైఖరిని తీవ్రంగా తప్పబట్టారు. పిఠాపనురంలో పవన్‌ను ఎలాగైనా ఓడించాలని వైఎస్సార్‌సీపీ, గెలిపించి తీరుతామని జనసైనికులు, అభిమానులు పోటీ పడుతున్న విషయం తెలిసిందే.

దీంతో పిఠాపురంలో ఎన్నికలు హోరా హోరీగా ఉన్నాయి. వైఎస్సార్‌సీపీ ముఖ్య నేతలకు మండలాలవారీగా బాధ్యతలు అప్పగించింది.

ఒక మండలానికి ఇటీవల పార్టీలో చేరిన ముద్రగడ పద్మనాభంను ఇంఛార్జ్ గా బాధ్యతలు అప్పగించారు.

పవన్ కళ్యాణ్‌ను ఓడించడమే తన లక్ష్యమంటూ పద్మనాభం కూడా ఘాటుగా విమర్శలు చేస్తున్నారు. ఆయన్ను ఓడించకపోతే తన పేరును కూడా మార్చుకుంటానని సవాల్ చేశారు.

అయితే ముద్రగడ పద్మనాభం చేసిన ఛాలెంజ్‌పై.. ఆయన కుమార్తె క్రాంతి స్పందించారు. ఈ మేరకు ఆమె ఓ వీడియోను విడుదల చేశారు.

‘పిఠాపురంలో పవన్ కళ్యాణ్‌ను ఓడించటానికి ఎన్ని చేయాలో అన్నీ చేస్తున్నారు. ముఖ్యంగా మా నాన్న పద్మనాభం బాధాకరమైన ఛాలెంజ్ చేశారు.

పవన్ కళ్యాణ్‌ను ఓడించి పిఠాపురం నుంచి తన్ని తరిమేయకపోతే ఆయన పేరును ముద్రగడ పద్మనాభం బదులు ముద్రగడ పద్మనాభం రెడ్డిగా మార్చుకుంటానన్నారు.

ఈ కాన్సెప్ట్ ఏంటో నాకు అర్థం కావడం లేదు. ఆయన ప్రకటన ముద్రగడ అభిమానులకు కూడా నచ్చలేదు అన్నారు.

వంగా గీతను గెలిపించడానికి కష్టపడొచ్చు.. కానీ పవన్ కళ్యాణ్, ఆయన అభిమానుల్ని కించపరిచేలా వ్యాఖ్యలు ఉండకూడదు.

పవన్ గెలుపు కోసం కృషి చేస్తానని ప్రకటన

మా నాన్నను పవన్ కళ్యాణ్‌ను తిట్టడం కోసమే జగన్ మోహన్ రెడ్డి వాడుతున్నారు. ఈ ఎన్నికల తర్వాత మా నాన్న పద్మనాభం ఎటూ కాకుండా వదిలేయడం పక్కా.

ఈ విషయంలో నేను మా నాన్న తీరును పూర్తిగా వ్యతిరేకిస్తున్నా.. నేను పవన్ కళ్యాణ్ గెలుపు కోసం నావంతుగా కృషి చేస్తా’ అంటూ వీడియోలో ప్రస్తావించారు.

ముద్రగడ పద్మనాభంకు కుమార్తె నుంచి ఊహించని పరిస్థితి ఎదురైంది. క్రాంతి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పిఠాపురంలో పవన్ కళ్యాణ్‌ను ఎట్టి పరిస్ధితుల్లోనూ ఓడించి తీరుతానని ముద్రగడ పద్మనాభం ఛాలెంజ్ చేశారు.

పవన్‌ను ఓడించి పిఠాపురం నుంచి పంపేయడ ఖాయమని.. ఆయన్ను ఓడించి పంపకపోతే తన పేరు పద్మనాభం కాదు పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని సవాల్ చేశారు.

పవన్ కళ్యాణ్ సమస్యలు, పద్ధతులు తెలుసుకుని మాట్లాడితే మంచిది అన్నారు. నోరుంది కదా ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదన్నారు.

పిఠాపురం నుంచి ప్రజలు పవన్ కళ్యాణ్‌ను తరిమేయడం ఖాయమన్నారు.

ముద్రగడ పద్మనాభం తన పేరును మార్చుకుంటానని చెప్పడంపైనే.. ఆయన కుమార్తె క్రాంత్రి స్పందించి కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గెలుపు కోసం పనిచేస్తానని ప్రకటించారు.

Also Read This Article : గాజు గ్లాసు గుర్తుపై జనసేనకు పాక్షిక ఊరట

Hyper Aadi Exclusive Interview
Hyper Aadi Exclusive Interview

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *