ANR :
ఏయన్నార్ అవార్డుకి నిండుతనం….
మెగాస్టార్ చిరంజీవికి అక్కినేని నేషనల్ అవార్డు లభించింది.
సెప్టెంబర్ 20వ తేది నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు జన్మదినం సందర్భంగా అక్కినేని నట వారసుడు అక్కినేని నాగార్జున స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు.
నాగార్జున మాట్లాడుతూ ‘‘ ఏయన్నార్’’ అవార్డు గురించి చిరంజీవిగారికి చెప్పగానే తాను ఎంతో ఎమోషనల్‌గా ఫీలయ్యారు.
ఇంతకంటే పెద్ద అవార్డు ఏముంటుంది అని అన్నారు నాగ్.
నిజమే చిరంజీవి తెరంగేట్రం చేసే సమయానికి తెలుగునాట అగ్రహీరోలు ఎవరు అంటే నిస్సందేహంగా యన్టీఆర్, ఏయన్నార్, కృష్ణ, శోభన్‌బాబు
ఈ నలుగురు తెలుగు సినిమాకి నాలుగు స్తంభాలలాంటివారు. వీరి తర్వాతే ఎవరైనా.
అలాంటి హేమాహేమిల దారిలో నడుస్తూ అంచెలంచెలుగా ఎదుగుతూ మెగాస్టార్ కుర్చీలో చిరంజీవి కూర్చోవటం ఆ నలుగురు అగ్రశ్రేణి నటుల కళ్లముందే జరిగింది.
అందుకే ఆ రోజుల్ని తలుచుకుని మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ అయ్యారు. ఇక ఏయన్నార్ అవార్డుల విషయానికి వస్తే 2006లో ప్రారంభమైంది ‘‘ఏయన్నార్’’ అవార్డు.
బాలీవుడ్ రొమాంటిక్ స్టార్ హీరో దేవానంద్ (2006) మొదలుకొని బాలీవుడ్ బ్యూటీ రేఖ (2019) వరకు అనేకమంది బాలీవుడ్ నటులు, సింగర్స్
ఈ అవార్డును దక్కించుకున్నారు. ఈ అవార్డును దక్కించుకున్న తొలి కమర్షియల్ తెలుగు హీరో చిరంజీవి.
భారతేశంలోని అనేకమంది అగ్రశ్రేణి నటీమణులు షబానా ఆజ్మి (2007), అంజలిదేవి–జయసుధ (2007), వైజయంతిమాల (2008)
ప్రముఖ సింగర్ లతా మంగేష్కర్ (2009) ప్రముఖ తమిళ దర్శకుడు కె.బాలచందర్ (2010) ఎవర్‌గ్రీన్ ఇండియన్ బ్యూటీ హేమమాలిని (2011)
భారత దేశం గర్వించే దర్శకుడు శ్యామ్‌బెనగల్ (2012)కు అవార్డులు అందించిన వరకు అక్కినేని బ్రతికే ఉన్నారు.
ఆ తర్వాత 2014లో క్యాన్సర్ బారినపడి ఆయన మృతిచెందారు.
ఆయన మృతి చెందిన తర్వాత అక్కినేని అవార్డును అందుకున్న తొలి కమర్షియల్ హీరో బాలీవుడ్ యాంగ్రి యంగ్ మెన్ అమితాబచ్చన్ అయ్యారు.
2016లో అక్కినేని నేషనల్ అవార్డు అందుకున్న రచయిత– ప్రముఖ రివ్యూ రైటర్, ఫేమస్ జర్నలిస్ట్ గుడిపూడి శ్రీహరి (2016).
ఆ తర్వాత ఏడాది తెలుగు దర్శక దిగ్గజం ఎస్.ఎస్ రాజమౌళి (2017), భారతదేశం మొత్తం గర్వపడే నటీమణి శ్రీదేవి (2018) , రేఖ (2019)లు
వరుసగా ఏయన్నార్ అవార్డును సొంతం చేసుకున్నారు. 2020 కోవిడ్ వచ్చిన తర్వాత అక్కినేని అవార్డును ప్రకటించలేదు.
దాదాపు 5ఏళ్ల గ్యాప్ తర్వాత 2024 సంవత్సరానికిగాను చిరంజీవి లాంటి కమర్షియల్ టాప్ హీరో
ఈ అవార్డును అందుకోవటంతో అవార్డుకు అవార్డు అందుకుంటున్న మెగాస్టార్‌కి నిండుతనం వచ్చింది.
ఏదేమైనప్పటికి నటసామ్రాట్ ఇంటి అవార్డు మెగాస్టార్ ఇంటికి చేరటం గొప్ప అవార్డు గానే పరిగణిస్తున్నారు అటు అక్కినేని అభిమానులు, అటు మెగాస్టార్
అభిమానులు. అక్టోబర్‌లో ఈ అవార్డును చిరంజీవికి అందచేయనున్నామని నాగార్జున తెలిపారు.
శివమల్లాల
Also Read This : దేవర 162 నిమిషాలట…