Anoosha Krishna :
నాకంటే పెద్ద వయసున్న కూతుర్లు ఆ నిర్మాతకు ఉన్నారు అని ఓ నిర్మాత గురించి మాట్లాడారామె.
తన తండ్రి వయసున్న నిర్మాత తనతో మాట్లాడుతూ నేను చెప్పినట్లు చేస్తే మా సినిమాలో హీరోయిన్ నువ్వే అంటూ ఇబ్బంది పెట్టిన మరో నిర్మాతను ఏం చేయాలి అని ప్రశ్నిస్తోంది ఈ హీరోయిన్.
ఆ రోజు అక్కడినుండి బయటకు వచ్చి క్యాబ్ ఎక్కి నేను ఏడ్చిన ఏడుపు నాకు ఇంకా గుర్తుంది అంటూ తను అనుభవించిన బాధను చెప్తుంటే ఒక్కసారిగా గుండె బరువెక్కింది.
హీరోయిన్‌గా అవకాశం రాకపోయినా నేను చదివిన చదువుకు ఏదో ఉద్యోగం చేసుకుని బ్రతకగలను.
కానీ హీరోయిన్ అవ్వాలనుకుని వచ్చి మరో పని చేయటం చేతకాని ఎంతోమంది నటీమణులు పరిస్థితి ఏంటి అంటూ గట్టిగా నిలదిస్తోంది ఈ శాండల్‌వుడ్ ముద్దుగుమ్మ.
ఎంతో పోరాటం చేసి బెంగుళూరు నుండి హైదరాబాద్‌కి వచ్చి ‘పేకమేడలు’ చిత్రంలో హీరోయిన్‌గా నటించి తన నటనతో అందరి చేత శహభాష్ అనిపించుకున్నారు అనూష కృష్ణన్.
తన మాతృ భాష కాకపోయినా తొలి సినిమాతోనే తెలుగు నేర్చుకుని ఎంతో కాన్ఫిడెంట్‌గా మాట్లాడిన అనూషను చూస్తుంటే ముచ్చటేసింది.
ట్యాగ్‌తెలుగు యూట్యూబ్ చానల్ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వూలో ఎన్నో ప్రశ్నలకు తనదైన స్టైల్లో సమాధానం చెప్పింది. ఇంటర్వూ బై శివమల్లాల
Also Read This : సినిమా మీద ప్యాషన్ ఉంటేనే సరైన నిర్మాత అవుతారు