వెన్నెల కిషోర్ టైటిల్ రోల్ పోషిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’.
అనన్య నాగళ్ల, సీయా గౌతమ్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని లాస్యారెడ్డి సమర్పణలో శ్రీ గణపతి సినిమాస్ బ్యానర్‌పై వెన్నపూస రమణారె డ్డి నిర్మించారు.
రైటర్ మోహన్ దర్శకత్వం వహించారు.
ఈ చిత్రం డిసెంబర్ 25న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా మీడియాతో అనన్య మాట్లాడుతూ : ”ఇప్పటివరకూ ఇలాంటి కథ నేను వినలేదు.
మోహన్ గారు కథ చెప్పినపుడు చాలా కొత్తగా అనిపించింది.
ఇది చాలా డిఫరెంట్ కథ వందశాతం ఆడియన్స్ కి ఈ సినిమా మంచి క్రిస్మస్ గిఫ్ట్ అవుతుంది.
తెలుగులో డిటెక్టివ్ సినిమా అనగానే చిరంజీవి గారి చంటబ్బాయ్ గుర్తుకు వస్తుంది. అందుకే అందరికీ కనెక్ట్ అయ్యేవిధంగా ఆ ట్యాగ్ ని పెట్టడం జరిగింది.
పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు చాలా అభిమానం.కోర్టు సీన్ చేస్తున్నప్పుడు చాలా బాగా చేస్తున్నారు మీలో ఎమోషనల్ కోషేంట్ చాలా ఉంది, రియల్ పెయిన్ కనిపిస్తుందని చెప్పారు.
అది నాకు చాలా ఆనందంగా అనిపించింది.ఈ సినిమా తర్వాత నా దగ్గరకి మంచి కథలు వచ్చాయి. ఓ రెండు సినిమాలు సైన్ చేశాను.” అని అన్నారు.
సంజు పిల్లలమర్రి