Sitaare Zameen Par: రూ.120 కోట్ల డీల్‌కు నో చెప్పిన అమిర్..

బాలీవుడ్ స్టార్‌ అమిర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘సితారే జమీన్ పర్’. ఈ సినిమా జూన్ 20న విడుదల కానుండటంతో ప్రమోషన్స్ బీభత్సంగా నిర్వహిస్తున్నారు. ఆర్ఎస్ ప్రసన్న దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను జెనీలియా ముఖ్య పాత్రలో నటించింది. ఈ చిత్రాన్ని ఆమిర్ ఖాన్, అపర్ణ పురోహిత్ నిర్మించారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర వార్త ఒకటి వైరల్ అవుతోంది. అది ఓటీటీ డీల్‌కు సంబంధించిన న్యూస్. ఈ మూవీకి దాదాపు రూ.120 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసేందుకు అమెజాన్ ప్రైమ్ ముందుకొచ్చింది.

అది పెద్ద విషయం కాదు కానీ.. ఈ డీల్‌ను అమిర్ ఖాన్‌ తిరస్కరించినట్లు సమాచారం. దీనికి కారణం.. ఈ సినిమాను కేవలం థియేటర్లలోనే ప్రదర్శించాలని అమిర్ ఖాన్ నిర్ణయించడం. ఓటీటీలో సినిమాను రిలీజ్ చేయకుంటే ప్రేక్షకులు తప్పనిసరిగా థియేటర్లకే వచ్చి చూసే అవకాశం ఉంది. అందుకే అమిర్‌ఖాన్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు సమాచారం. థియేటర్లలో ప్రదర్శితమైన అనంతరం యూట్యూబ్‌లో సినిమాను అందుబాటులో ఉంచనున్నట్టు అమిర్ ఖాన్ తెలిపారు. అయితే ఉచితంగా మాత్రం కాదు.. దీనికి యూట్యూబ్‌లో డబ్బు చెల్లించాల్సి ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *