...

కాంగ్రెస్ లోకి అంబర్ పేట ఎమ్మెల్యే?

Amberpet MLA : 

అధికార పార్టీ నేతలతో టచ్ లోకి కాలేరు వెంకటేశ్?

బీఆర్ఎస్ లో మరో వికెట్ పడే సూచనలు కనిపిస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ నుంచి మరో ఎమ్మెల్యే కారు దిగి.. కాంగ్రెస్ లో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్.. పార్టీ వీడే యోచనలో ఉన్నట్లు, ఈ మేరకు కాంగ్రెస్ నేతలతో టచ్ లోకి వచ్చినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ పెద్దగా ప్రభావం చూపలేకపోయిన విషయం తెలిసిందే. గ్రేటర్ పరిధిలో ఆ పార్టీ నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవలేదు.దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకోవడం ద్వారా రానున్న లోక్‌సభతో పాటు.. కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపొందచ్చనే అంచనాలో హస్తం పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. తాము గేట్లు ఓపెన్ చేశామని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల తర్వాత.. బీఆర్‌ఎస్ నేతలు హస్తం పార్టీలోకి క్యూ కడుతుండడం జరుగుతోంది. గత పదేళ్లుగా కేసీఆర్ వెంట నడిచిన నాయకులు పార్టీని వీడి పక్క పార్టీల్లో చేరుతున్నారు. ఇప్పటికే కే కేశవరావు, కడియం శ్రీహరి వంటి వారు బీఆర్‌ఎస్‌కు గుడ్ బై చెప్పగా.. తాజాగా ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కూడా పార్టీని వీడేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ మేరకుకీసరలోని ఓ ఫామ్‌ హౌస్‌లో బీఆర్‌ఎస్ నియోజకవర్గ నేతలతో ఆదివారం ఆయన సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. తన భవిష్యత్తు కార్యాచరణపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే గత నాలుగు రోజులుగా కాలేరు వెంకటేష్ బీఆర్ఎస్ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. శనివారం అంబర్ పేటలో పర్యటించాల్సి ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అందుబాటులో లేకపోవడంతో తన పర్యటనను వాయిదా వేసుకున్నారు. రెండు, మూడు రోజుల్లో కాలేరు వెంకటేష్ వ్యవహారంపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

 

Also Read This Articel :  సీఎం రేవంత్ రెడ్డితో కేకే భేటీ

 

IS EVM HACKING POSSIBLE ?
IS EVM HACKING POSSIBLE ?

 

Also Read This Article : నిన్న టీచర్.. నేడు ఎంపీ అభ్యర్థి 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.