షాక్ ఇచ్చిన అల్లు అరవింద్..  ఫేక్ ఐడీతో ఆ హీరోయిన్‌ను ఫాలో అవుతున్నారట..

అల్లు అరవింద్ ఫేక్ ఐడీతో ఓ హీరోయిన్‌ను ఫాలో అవుతుంటారట. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం. ఆయనే స్వయంగా తెలిపారు. బన్నీ వాస్ నూతన నిర్మాణ సంస్థ బీవీ వర్క్స్ సమర్పణలో సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘మిత్ర మండలి’. ఈ సినిమా టీజర్ లాంచ్ కార్యక్రమం తాజాగా జరిగింది. ఈ కార్యక్రమంలో అల్లు అరవింద్ ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ‘మిత్ర మండలి’ హీరోయిన్ ఎన్ఎమ్ నిహారిక గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు నిహారిక ముందుగానే తెలుసని.. బన్నీ వాసు తనకు కొందరు అమ్మాయిల ఫోటోలు ఇచ్చి సెలక్ట్ చేయమన్నారని.. వాటిలో నిహారిక ఫోటో ఒకటని తెలిపారు.

నిహారిక ఎవరనేది మీకు ముందుగానే తెలుసా? అని ప్రశ్నించగా.. ఒక ఫేక్ ఐడీతో ఆమెను ఫాలో అవుతానని.. ఆమె వీడియోస్ చూస్తుంటానని అల్లు అరవింద్ చెప్పుకొచ్చారు. అల్లు అరవింద్ చెబుతుంటే.. నిహారిక సైతం బ్లాంక్ ఫేస్ పెట్టింది. దీంతో అల్లు అరవింద్.. ‘నిజంగానే నేను నిన్ను ఫేక్ ఐడీతో ఫాలో అవుతాను’ అని పేర్కొనడం ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలోనే పక్కన ఉన్నవారు.. ఇది ఫేక్ ఐడీ కాదని.. మీ పర్సనల్ ఐడీ అని చెప్పడంతో తప్పేముందని ప్రశ్నించారు. దీనికి తన పర్సనల్ ఐడీతో ఏం చేసినా బూతులతో రెచ్చిపోతారని చెప్పుకొచ్చారు. అందుకే వేరే అకౌంట్స్‌తో అందరినీ అబ్జర్వ్ చేస్తుంటానని అల్లు అరవింద్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *