Pushpa 2 Records :
సినీ అభిమానులు అందరు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూసిన ”పుష్ప 2” సినిమా మరో రెండు రోజుల్లో థియేటర్లలోకి రాబోతోంది.
మూడేళ్ళ క్రితం ‘పుష్ప 1’లో ‘తగ్గేదేలే’ అంటూ వచ్చిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఇప్పుడు సెకండ్ పార్ట్ తో ‘అస్సలు తగ్గేదేలే’ అంటూ వస్తున్నారు.
గత కొన్ని రోజులుగా పుష్ప ఫీవర్ కొనసాగుతోంది. ఎక్కడ చూసినా పుష్ప మ్యానియానే కనిపిస్తోంది.
అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్ చూస్తుంటే ‘పుష్ప ది రూల్’ సినిమా వరల్డ్ బాక్సాఫీస్‌ను రూల్ చేస్తుందేమో అనిపిస్తుంది.
డిసెంబర్ 5న పుష్పరాజ్ ప్రేక్షకుల ముందుకు వస్తున్న కారణంగా రిలీజ్ కు ముందే ‘పుష్ప-2’ క్రియేట్ చేసిన రికార్డ్స్…
*’పుష్ప: ది రూల్’ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 12,00+ స్క్రీన్స్‌లో 6 భాషల్లో (తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం, బెంగాలీ) విడుదల చేయనున్నారు.
ఇది ఇండియన్ సినిమాలో బిగ్గెస్ట్ రిలీజ్ గా రికార్డు సృష్టించింది.
* ఓవర్సీస్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ లో అత్యంత వేగంగా 50 వేల టికెట్స్ అమ్ముడైన సినిమాగా ‘పుష్ప 2: రికార్డ్ క్రియేట్ చేసింది.
*నార్త్ అమెరికాలో టికెట్ల ప్రీసేల్స్ ద్వారా అత్యంత వేగంగా 1 మిలియన్ డాలర్ల మార్క్‌ను క్రాస్ చేసిన మూవీగా ‘పుష్ప 2’ నిలిచింది.
* పసిఫిక్ మహాసముద్ర ద్వీపాల్లోని ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఫిజీ లాంటి 14 దేశాలను కలిపి ఓషియానియాగా పిలుస్తారు.
అక్కడ ప్రీసేల్స్ ద్వారా $700K వసూలు చేసిన ఫస్ట్ ఇండియన్ సినిమాగా ‘పుష్ప 2’ రికార్డు నెలకొల్పింది.
* ‘పుష్ప 2: ది రూల్’ కేరళ బాక్సాఫీస్ వద్ద 12 గంటల్లోపే అడ్వాన్స్ బుకింగ్ సేల్స్ ద్వారా రూ. 1 కోటికి పైగా కలెక్షన్స్ నమోదు చేసిన తెలుగు సినిమాగా ఆల్ టైమ్ రికార్డ్ సెట్ చేసింది.
*హిందీ వెర్షన్ అడ్వాన్స్ బుకింగ్స్ లో 24 గంటల్లోనే 1 లక్ష టికెట్స్ అమ్ముడైన బాలీవుడ్ ఆల్ టైమ్ టాప్ మూవీస్ లిస్ట్‌లో ‘పుష్ప 2’ మూడో స్థానంలో నిలిచింది.
సంజు పిల్లలమర్రి
Also read this : కేసీర్ ఫ్యామిలీ నుండి రాకేష్ కి 20 కోట్లు వచ్చాయా ?